Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘చిత్రం’, ‘జయం’ వంటి పలు ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించి పలువురు హీరోలు, హీరోయిన్స్, నటీ నటులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు తేజ సూపర్ స్టార్ మహేష్‌బాబుతో ‘నిజం’ అనే చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఆ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. కాని సినిమాలో మహేష్‌బాబు అద్బుత నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఇక సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు, పలు జ్యూరీ అవార్డులు కూడా దక్కాయి. కరెప్షన్‌పై తీసిన ఆ సినిమా అప్పుడు కాకుండా ఇప్పుడు వచ్చి ఉంటే ఫలితం పూర్తి భిన్నంగా ఉండేదని, ప్రేక్షకులు కమర్షియల్‌గా భారీ విజయాన్ని ఇచ్చేవారు అనేది తేజ అభిప్రాయం.
‘నిజం’ చిత్రం ఒక మంచి చిత్రమని, అందుకే ఆ సినిమా తన కెరీర్లో ప్రత్యేకం అంటూ తేజ చెప్పుకొచ్చాడు. ఆ ప్రత్యేకమైన సినిమాకు తాను త్వరలోనే సీక్వెల్‌ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా పేర్కొన్నాడు. తాజాగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ‘నిజం’ చిత్రం సీక్వెల్ పనులను వెంటనే మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సీక్వెల్‌ను మహేష్‌బాబుతో కాకుండా అంతా కొత్త వారితో తెరకెక్కిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. కొత్త వారితో గతంలో తాను చేసిన సినిమాల తరహాలోనే ఈ చిత్రం ఉంటుందని తేజ పేర్కొన్నాడు. వచ్చే సంవత్సరం వరకు ‘నిజం’ చిత్రానికి సీక్వెల్ వస్తుందేమో చూడాలి.
మరిన్ని వార్తలు: