Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అతను ఓ మాజీ ముఖ్యమంత్రి కొడుకు… స్వయంగా మంత్రిగా చేసిన అనుభవం. అయినా చిన్నపిల్లవాడిలా ముఖ్యమంత్రి దెయ్యాలు వదిలాడంటూ ఆరోపణలు చేసాడు. ఇంతకీ ఎవరి గురించి చెబుతున్నామో మీకు అర్ధం అయ్యే ఉంటుంది. ఆయనే లాలూ పుత్రరత్నం తేజ్ ప్రతాప్. మంత్రి పదవి పోయాక బంగళా ఖాళీ చేయమంటే నానా వంకలు చెప్పి కోర్టుకు కూడా వెళ్లిన తేజ్ ప్రతాప్ హఠాత్తుగా ఆ భవనాన్ని వదిలి వెళ్లిపోయారు. పోతూ పోతూ ఆ బంగళాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దెయ్యాలు వదిలివెళ్లారు అని ఆరోపించడం దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఓ రాష్ట్రానికి మంత్రిగా పని చేసినవాడు, పైగా చదువుకున్న యువకుడు దెయ్యాల గురించి ఇలా చెప్పడం చూసి అంతా నోరు వెళ్లబెడుతున్నారు.
తేజ్ ప్రతాప్ ఇన్నాళ్లు బస చేసిన బంగళాలో దెయ్యాలు వున్నాయనడం వెనుక పెద్ద కధే వుంది. తేజ్ ప్రతాప్ కి ఇలాంటి నమ్మకాలు ఎక్కువే. అలాంటి మనిషి ఈ కొంపలో ఇన్నాళ్లు ఎలా వున్నాడు ? . ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెదికితే భలే సీక్రెట్ బయటపడిందట. ఎన్నో నమ్మకాలున్న తేజ్ ప్రతాప్ మంత్రిగా వున్నప్పుడు ఈ బంగాళాలోకి వచ్చే ముందు ఎన్నో పూజలు చేశారు. వాస్తు పరంగా కూడా ఇంకెన్నో మార్పులు చేశారు. వీటి అన్నిటి కన్నా మిన్నగా తనకు నచ్చినట్టు ఆ బంగాళా ఇంటీరియర్ చేయించారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బంగాళా ఖాళీ చేయాల్సిరావడంతో తేజ్ ప్రతాప్ తన బుర్రకు పని చెప్పాడు. వన్ సైడ్ లవర్ తనకు దక్కని అమ్మాయి ఇంకెవరికీ దక్కకూడదు అని వ్యవహరించిన తీరుగా తాను నివసించిన బంగళాలో ఇంకెవరూ ఉండకూడదన్న పద్ధతిలో ఈ దెయ్యాల కథ అల్లేశారు. ఎంతైనా లాలూ కొడుకు కదా… ఆయనేమో స్కూటర్లు మీద పశువుల గడ్డి తరలించినట్టు చెప్పి జైలుకు వెళితే ఈయన ఏమో దెయ్యాల కధలు చెబుతున్నాడు. అంతా డిఎన్ఏ మహత్యం.