Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. చివరకు ప్యాకేజీతో సరిపెట్టారు. ఆ ప్యాకేజీ నిధులు కూడా సరిగ్గా రిలీజ్ చేయడం లేదు. అదేమంటే పాత నిధులకు లెక్క చెప్పాలని స్కూలు పిల్లాడ్ని హెడ్మాస్టర్ గద్దించినట్లు గద్దిస్తున్నారు. కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేయడానికి రాజ్యాంగం అనుమతించలేదు. తమకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎలాగైనా ఖర్చుచేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉంది. కానీ కేంద్రం మాత్రం బ్యాంకుల మాదిరిగా ప్రతి దానికీ అకౌంట్లు అడుగుతూ సీఎంలను బానిసలుగా మార్చేస్తోందని విమర్శలు వస్తున్నాయి.
ఇక విభజన తర్వాత ఇంకా బాలారిష్టాలను ఎదుర్కుంటున్న ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. ప్రత్యేక హోదా సంగతి పక్కనపెడితే ప్రధానమైన రైల్వేజోన్ సమస్య అలాగే ఉంది. అదేమంటే ఒడిషా ఎంపీలు హడావిడి చేస్తున్నారని మాట అడ్డమేస్తున్నారు. కానీ అసలు విషయం వేరే ఉందట. ఒడిషాలో ఈసారి అధికారం ఖాయమని ఆశలు పెంచుకుంటున్న బీజేపీ.. ఒక్క సీటుకూ గ్యారెంటీ లేని ఏపీ కోసం అధికారం దక్కే రాష్ట్ర ప్రజల మనసు ఎందుకు నొప్పించాలని ఆలోచిస్తోందట. ఈ లెక్కన రైల్వే జోన్ హుళక్కే.
ఇక రాజకీయాల విషయానికొస్తే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ నియోజకవర్గాల పునర్విభజన డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆ ఫైలు అసలు ఎక్కడుందో కూడా క్లారిటీ రావడం లేదు. అప్పుడప్పుడూ వెంకయ్య హడావిడే కానీ.. సంబంధిత మంత్రిత్వశాఖ మాత్రం మౌనంగానే ఉంది. ఓవైపు ప్రతిపక్షాలు దూకుడు పెంచుతంటే.. కేంద్రం మాత్రం నాన్చుతోందని ఇద్దరు సీఎంలు అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు నియోజకవర్గాలు పెంచడం ఇష్టం లేదని, అందుకే అమిత్ షా అడ్డుపడుతున్నారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
మరిన్ని వార్తలు: