సెప్టెంబరు 2 న తెరాస అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన’ సభకు ముందే తెలంగాణ కేబినెట్ సమావేశం కానుందన్న వార్త ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో చర్చనీయంసం అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం ఉంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. అయితే ప్రగతి నివేదన సభ ప్రారంభానికి కరెక్ట్ గా గంట ముందు కేబినెట్ భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ రద్దుపై ఊహాగానాలు నడుస్తున్న సమయంలోనే కేసీఆర్ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. దీంతో ఈ సమావేశంలో ప్రభుత్వ రద్దు మీద తీర్మానం చేసి దానిని గవర్నర్ కు అందచేసి పత్యేక హెలికాప్టర్ లలో మంత్రులంతా సభా సతలికి చేరుకుంటారని తెలుస్తోంది.