ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. దాదాపు 20నిమిషాల పాటు ఇద్దరి మధ్య భేటీ కొనసాగింది. భేటీలో కేవలం జోనల్ వ్యవస్థ గురించి మాత్రమే కేసీఆర్ మోదీతో చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన అంశాలే ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. నిజానికి కేసీఆర్ ముందస్తు ఎన్నికల గురించి మోడీతో చర్చించడానికి వెళ్లినట్టు ప్రచారం జరిగింది.
కానీ వారి భేటీ ఇరవై నిముషాల్లో ముగియడం మీద ఇప్పుడు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 20 నిమిషాలు మాత్రమే భేటీ కొనసాగడంతో మరోసారి కేసీఆర్ మోదీతో భేటీ అవుతారా? అన్న ప్రశ్న కూడా వ్యక్తమవుతోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముందస్తు ఎన్నికలపై మరింత పొలిటికల్ హీట్‌ను రాజేసిన నేపథ్యంలో.. తాజా భేటీలో అలాంటి ప్రస్తావన లేకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. అయితే మోదీ-కేసీఆర్ భేటీలో జరిగిన చర్చకు సంబంధించి అధికారికంగా ఎటువంటి స్పష్టత లేకపోవడంతో వాస్తవంగా వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగిందనే దానిపై క్లారిటీ లేదు.