బడ్జెట్ ప్రవేసపెట్టిన కేసీఆర్ !

Telangana CM KCR Presents Budget 2019-20

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత తొలి బడ్జెట్‌ ను ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. పెట్టింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌గా శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవానులకు శాసనసభ ఘన నివాళి అర్పించింది. కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పుల్వామా ఉగ్రదాడి అమానుషం అని కేసీఆర్ అన్నారు. పుల్వామా ఘటన యావత్తు భారతదేశ ప్రజల గుండెల్ని కలచివేసిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరులైన జవానుల కుటుంబాలకు దేశం యావత్తు సాయంగా నిలవాలని పిలుపునిచ్చారు. అమరులైన ఒక్కో జవాను కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అమరుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. . రూ.లక్షా 82,017 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను సీఎం ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.లక్షా 31,629 కోట్లు, ఆర్థికలోటు- రూ.27,749 కోట్లు, రెవెన్యూ మిగులు- రూ.6,564 కోట్లు, ప్రగతి పద్దు- రూ.లక్షా 7,302 కోట్లు, నిర్వహణ పద్దు- రూ.74,715 కోట్లు, రూ. 2లక్షల కోట్లు దాటని తెలంగాణ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టాక దీనికి సార్ధకత వస్తుందని భావిస్తున్నారు.

తెలంగాణ ఓటాన్ బడ్జెట్ లో కేటాయించిన పద్దు :

2019-20 సంవత్సరానికి మొత్తం బడ్జెట్ రూ.1,82,017 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,31,629 కోట్లు
మూల ధన వ్యయం రూ.32,815 కోట్లు
రెవెన్యూ మిగులు అంచనా రూ.6,564 కోట్లు
ఆర్థిక లోటు రూ.27,749 కోట్లు
ప్రగతి పద్దు అంచనా వ్యయం రూ.1,07,302 కోట్లు
నిర్వహణ పద్దు అంచనా వ్యయం రూ.74,715 కోట్లు
2017-18 ఆర్థిక సంవత్సరంలో చేసిన మొత్తం వ్యయం రూ.1,43,133 కోట్లు
2017-18లో మొత్తం రెవెన్యూ రాబడుల విలువ రూ.88,824 కోట్లు
రెవెన్యూ ఖాతాలో మొత్తం ఖర్చు రూ.85,365 కోట్లు
2017-18లో రెవెన్యూ మిగులు రూ.3,459 కోట్లు

కేటాయింపులు:

సాగునీటి రంగానికి రూ.22,500 కోట్లు
వ్యవసాయాభివృద్ధి కోసం రూ.20,107 కోట్లు
ఎస్సీల ప్రగతి కోసం రూ.16,581 కోట్లు
ఎస్టీల అభ్యున్నతికి రూ.9,827 కోట్లు
ఆసరా పెన్షన్ల కోసం రూ.12,067 కోట్లు
రైతుబంధు సాయం ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10వేలకు పెంపు. రైతుబంధు కోసం రూ.12వేల కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.5536 కోట్లు
రైతు బీమా కోసం రూ.650 కోట్లు
రైతు రుణమాఫీ కోసం రూ.6వేల కోట్లు
మైనారిటీ సంక్షేమానికి రూ.2004 కోట్లు
ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు
నిరుద్యోగభృతికి రూ.1810 కోట్లు
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి రూ.1450 కోట్లు
బియ్యం సబ్సిడీకి రూ.2,744 కోట్లు
పంచాయతీలకు రెండు ఫైనాన్స్‌ కమిషన్ల నుంచి రూ.3,256కోట్లు