Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ ఏఱ్పాటైన దగ్గర్నుంచి కేటీఆర్ సీఎం అవుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా టీఆర్ఎశ్ లో కూడా ఎన్నికల నాటికి కేటీఆర్ తెరపైకి వస్తారని చర్చ జరిగింది. చాలా మంది నేతలు అది నిజమేనని ఢంకా బజాయించారు. కానీ ఇప్పుడు అనధికారికంగా కేటీఆర్ సీఎం అయిపోయారు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో సమీక్షలు చేస్తూ హల్చల్ చేస్తున్నారు.
కేసీఆర్ వాస్తు సమస్య పేరుతో సీఎం క్యాంప్ ఆఫీస్ వదిలేసి.. అంతా జనహిత నుంచే పాలన సాగిస్తున్నారు. అందుకే ఖాళీగా ఉంచడం ఎందుకని సీఎం క్యాంప్ ఆఫీస్ ను కేటీఆర్ వాడుతున్నారు. గతంలో సీఎం కుర్చీకి దూరంగా మరో కుర్చీ వేసుకుని సమీక్షలు జిరిపిన కేటీఆఱ్.. ఇప్పుడు ఏకంగా సీఎం కుర్చీ పక్కనే ఛైర్ వేసుకుని రివ్యూలు చేస్తున్నారు.
అయితే సీఎం క్యాంప్ ఆఫీస్ వాడితే.. సీఎం అయిపోతారా అని కేటీఆర్ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. ఉన్న బిల్డింగులు సద్వినియోగం చేసుకున్నా.. దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. కేసీఆర్ మరో ఇరవై ఏళ్లు సీఎంగా ఉంటారని కేటీఆఱ్ చాలా సార్లు చెప్పారన, అయినా మసాలా కోసమే కొందరు ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని వాళ్లు వాపోతున్నారు.
మరిన్ని వార్తలు: