త్వరలో పెరగనున్న మొబైల్ చార్జీలు

త్వరలో పెరగనున్న మొబైల్ చార్జీలు

రిలయన్స్‌ జియో చార్జీలు ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై అమలు చేస్తున్నాయి.తాజాగా భారతీ ఎయిర్‌ టెల్‌ ప్రస్తుతం వసూలు చేస్తున్న రేట్లతో కష్టమేనంటూ తెలిపింది. ఇంకా మిగతా టెలికం సంస్థలు కూడా చార్జీల పెంపుకి సిద్దంగా ఉన్నాయి. ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో (ఐఎంసీ) పాల్గొన్న ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈవో గోపాల్‌ విఠల్‌ మాట్లాడుతూ టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఉన్న టారిఫ్‌లతో నిలదొక్కుకోవడం కష్టమని తెలిపారు.

ఇంటర్‌ కనెక్షన్‌ యూసేజ్‌ ఐయూసీ యూజర్లపై నిమిషానికి 6పైసల చార్జీలు జియో వసూలు చేస్తుండడం ఖండిస్తూ టారిఫ్‌కి ఐయూసీకి సంబంధం లేదని వెల్లడించారు. 5జీ స్పెక్ట్రం వేలానికి ప్రతిపాదించిన ధర చాలా అధికమని, దీనివల్ల 5జీ సేవలకి వినియోగదారులు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు.డిజిటల్‌ ఇండియా కల సాకారం టెలికం రంగంలోకి పెట్టుబడులు పెట్టడం వల్లనే సాధ్యమని ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈవో గోపాల్‌ విఠల్‌ చెప్పారు.

వేరే నెట్‌వర్క్‌ల యూజర్లనుంచి వచ్చే కాల్స్‌కి టెల్కోలు విధించుకునే చార్జీలను ఐయూసీగా పరిగణిస్తారు. ఐయూసీ చార్జీలను ఇతర టెల్కోలు కూడా యూజర్లకు తెలీకుండా విధిస్తున్నాయని జియో ప్రెసిడెంట్‌ మాథ్యూ ఊమెన్‌ ఆరోపిస్తూ పారదర్శకత పాటించాలని కోరారు.