మళ్లీ ప్రారంభమైన అన్నదమ్ముల సవాళ్లు..

విజయవాడలో అన్నదమ్ముల సవాళ్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. కేశినేని నాని, ఆయన సోదరుడు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. బుధవారం ఎంపీ చిన్నిపై ఎక్స్‌లో విమర్శలు చేస్తూ నాని ట్వీట్ చేశారు. చిన్ని తన కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించాలన్నారు. చిన్ని చేయని అక్రమ దందాలు లేవని కేశినేని నాని ట్వీట్ లో ఆరోపించారు. సోషల్ మీడియా రోడ్లపై మతి భ్రమించి ఓ సైకో తిరుగుతున్నారని, సోషల్ మీడియాలో కసి, పగ, ద్వేషంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ట్వీట్ చేశారు.