జబర్దస్త్‌కు ముందు పలు చిత్రాల్లో నటించిన రష్మీకి అప్పట్లో ఏమాత్రం గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే ఈటీవీలో జబర్దస్త్ షోతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చిందో అప్పటి నుండి ఈమె దశ తిరిగి పోయింది. వరుసగా రష్మీ ఏదో ఒక షోతో పాపులారిటీని మరింతగా పెంచుకుంటూ పోతూనే ఉంది. యాంకర్‌గా స్టార్‌డంను దక్కించుకున్న రష్మీ మరో వైపు హీరోయిన్‌గా కూడా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది. అయితే వచ్చిన ప్రతి ఆఫర్‌కు ఓకే చెప్పకుండా అడపా దడపా చిత్రాలు చేస్తూ వస్తున్న రష్మీ ఆమద్య ‘గుంటూరు టాకీస్’ అనే చిత్రం చేసి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆ చిత్రంలో రష్మీ అందాల ప్రదర్శణతో వెండి తెర హీట్ ఎక్కింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించిన రష్మీ గౌతమ్ కమర్షియల్‌గా మాత్రం సక్సెస్‌లను దక్కించుకోలేక పోతుంది.
ఈమె నటించిన సినిమాలు సక్సెస్ కాకున్నా కూడా ఈమెతో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈమె నటించిన ‘అంతకు మించి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంలో కూడా రష్మీ తన గ్లామర్‌తో అరించేందుకు సిద్దం అవుతుంది. ఈ చిత్రం చాలా రోజుల క్రితమే పూర్తి అయినప్పటికి కొన్ని కారణాల వల్ల సినిమా విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు సినిమాను విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత సన్నాహకాలు చేస్తున్నాడు. పూర్తిగా రష్మీ గ్లామర్‌తోనే ఈ చిత్రాన్ని నడిపించబోతున్నట్లుగా ఇటీవల విడుదలైన పోస్టర్స్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. తప్పకుండా ఈ చిత్రంలో రష్మీ గ్లామర్‌తో అలరించడం ఖాయం అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మరి ఈ చిత్రంతో అయినా రష్మీ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంటుందో చూడాలి.