“టీజర్‌తో సంచలనం సృష్టిస్తున్న ‘ద గర్ల్ ఫ్రెండ్’!”

"'The Girlfriend' is creating a sensation with its teaser!"
"'The Girlfriend' is creating a sensation with its teaser!"

రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘ద గర్ల్ ఫ్రెండ్’. ప్రముఖ నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తీస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. ఎమోషనల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ మూవీ టీజర్ చాల బాగా ఆకట్టుకుంది. పైగా విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ సాగడం ఒక విశేషం. ‘నీకని మనసుని రాసిచ్చేసా.. పడ్డానేమో ప్రేమలో బహుశా’ అని విజయ్ దేవరకొండ చెబుతుంటే.. స్క్రీన్‌పై రష్మిక విజువల్స్ చాలా చాలా బాగున్నాయి. మొత్తానికి టీజర్ మూవీ పై అంచనాలను మరింతగా పెంచింది.

"'The Girlfriend' is creating a sensation with its teaser!"
“‘The Girlfriend’ is creating a sensation with its teaser!”

ముఖ్యంగా టీజర్ మొత్తం రష్మిక క్లోజప్ షాట్స్ కనిపించాయి. మొత్తానికి ఈ సినిమా లో రష్మిక యాక్టింగ్ అదరగొట్టేయబోతుందనిపిస్తోంది. కాగా ‘ద గర్ల్ ఫ్రెండ్’ మూవీ ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక హేసమ్ అబ్దుల్ సంగీతమందించగా.. ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి.. రష్మికకు జోడిగా కనిపించబోతున్నారు . బహుశా ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ ఉండొచ్చు అని టాక్ వినిపిస్తోంది.