ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ కీలకంగా మారాలన్న తాపత్రయంతో కష్టపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇటీవలే చంద్రబాబు అరెస్ట్ అయ్యాక, వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ తరువాత మళ్ళీ కనబడింది లేదు.. తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటనతో పవన్ కళ్యాణ్ వార్తల్లోకి రావడం జరిగింది.
కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గల్ఫ్ దేశాలకు జనసేన తరపున కన్వీనర్ లను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్రకారం చూస్తే.. యూఏఈ దేశానికి కేసరి త్రిమూర్తులు మరియు మోగళ్ళ చంద్రశేఖర్ లను నియమించారు . కువైట్ కు కాంచన శ్రీకాంత్ మరియు బాణావత్ రామచంద్ర నాయక్ లను నియమించారు.సౌదీ అరేబియా కు గుండాబత్తుల సూర్య భాస్కర్ రావు, కసిరెడ్డి శ్రీ నగేష్, అమీర్ ఖాన్, చింతల శ్రీరామమూర్తి లను నియమించారు. ఒమన్ దేశానికి చందక రాంబాబును కన్వీనర్ గా నియమించడం జరిగింది.