Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గతంలో ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మీడియాను మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రిగా తన పని తాను చేసుకుపోతున్నా.. మీడియా మేనేజ్ మెంట్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారని అప్పట్లో విపక్షాలు ఎద్దేవా చేశాయి. నిజంగా బాబు మీడియా మేనేజ్ మెంట్ చేసి ఉంటే.. కొన్ని ఛానెళ్లు.. పనిగట్టుకుని 2004 ఎన్నికలప్పుడు వ్యతిరేక ప్రచారం చేస్తే ఆయన ఊరుకునేవారు కాదు.
కానీ ఇప్పుడు మోడీ, కేసీఆర్ పబ్లిగ్గానే మీడియాను కంట్రోల్ చేస్తున్నారు. అదేమంటే ఛానెళ్లనే బెదిరిస్తున్నారు. మీరు చేసిన తప్పులు మా దగ్గరున్నాయని వార్నింగులు ఇస్తున్నారు. ఇన్ని చేస్తున్నా వారిని పల్లెత్తు మాట అనడానికి మన మీడియాకు నోరు రావడం లేదు. ఎందుకంటే ఏమంటే ఏం కోపం వస్తుందో… ఎలా ఇరుకునపెడుతారో అన్న భయం.
చంద్రబాబు ఏమీ చేయకపోయినా ఆయన్ను ఆడిపోసుకున్న మీడియాకు.. ఇప్పుడు మోడీ, కేసీఆర్ వ్యవహారం మింగుడు పడటం లేదు. అయినా సరే గప్ చుప్ గా ఉండాల్సి వస్తోంది. ఎందుకంటే ఇద్దరూ పవర్లో ఉన్నారు. పైగా బలంగా ఉన్నారు. ఇప్పటికీ మీడియా స్వేచ్ఛ ఎంతోకొంత ఏపీలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. అక్కడ వచ్చినన్ని ప్రభుత్వ వ్యతిరేక వార్తలు కేసీఆర్, మోడీ మీద రావట్లేదు. దీన్ని బట్టి ఎవరిది మీడియా స్వేచ్ఛ అనే విషయం అర్థమవుతోంది.
మరిన్ని వార్తలు