ఏపీలో రేపటి నుంచి కుల గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే 5 ప్రాంతాల్లో రేపు ప్రయోగాత్మకంగా కులగణన ప్రారంభం అవుతుంది. 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో కుల గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కుల గణన ప్రారంభిస్తారు. రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా కులగణన జరుగనుంది.
ఈ నెల 22 వరకు కుల గణనపై శిక్షణ ఇస్తారు. రేపటి నుంచి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగనున్నాయి. ఐదు పట్టణాల్లో ప్రాంతీయ సదస్సులు జరుగుతాయి. ఈ నెల 17న కర్నూలు, రాజమండ్రి, ఈ నెల 20న విశాఖ, విజయవాడ, 24న తిరుపతి లో ప్రాంతీయ సదస్సులు ఉంటాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కుల గణన ప్రక్రియను విజయవంతం చేయాలని ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి సమస్యలు లేకుండా.. విజయవంతం చేయాలని అన్నారు.