Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్‌తో బిగ్‌బాస్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. రెండవ సీజన్‌కు కూడా ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తే బాగుండేది అంటూ తెలుగు ప్రేక్షకులు కోరుకున్నారు. కాని రెండవ సీజన్‌కు కొన్ని కారణాలు చూపుతూ ఎన్టీఆర్ తప్పుకున్నాడు. ఆ స్థానంలో నానిని తీసుకు రావడం జరిగింది. నాని ఎంట్రీతో బిగ్‌బాస్‌కు అంత క్రేజ్ దక్కుతుందా అనేది ప్రస్తుతం అందరిలో జరుగుతున్న చర్చ. భారీ అంచనాల నడుమ జూన్ 10 నుండి బిగ్‌బాస్ సీజన్ 2 ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలోనే బిగ్‌బాస్ నుండి ఎన్టీఆర్ తప్పుకోవడానికి పెద్దగా కారణం ఏమీ లేదని, బిగ్‌బాస్‌పై ఆసక్తి లేకపోవడం వల్లే ఎన్టీఆర్ తప్పుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బిగ్‌బాస్ నుండి ఎన్టీఆర్ తప్పుకోవడానికి సినిమాల బిజీ లేదంటే పారితోషికం కాదని, ఎన్టీఆర్‌కు బిగ్‌బాస్ పెద్దగా సంతృప్తి ఇవ్వలేదని, మొదటి సీజన్ సమయంలో ఆయన కొన్ని సార్లు అసహనంతో కనిపించాడు. వారంలో రెండు రోజులు ఈ షోకు కేటాయించడం అంటే పెద్ద విషయం కాదు. వంద రోజుల పాటు ఎన్టీఆర్ డేట్స్ కేటాయించేవాడు. కాని బిగ్‌బాస్‌పై ఆసక్తి లేని కారణంగానే ఎన్టీఆర్ నో చెప్పాడని, బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పేవాడని, అలాగే రాజమౌళి సినిమా మొదలయ్యే సమయానికి సీజన్ 2 పూర్తి అయ్యేదంటూ ప్రచారం జరుగుతుంది. పారితోషికం లేదా డేట్లు కుదరక పోవడం కానే కాదని, కేవలం ఎన్టీఆర్‌కు ఆసక్తి లేకపోవడం వల్లే బిగ్‌బాస్ నుండి తప్పుకున్నాడంటూ సమాచారం అందుతుంది. మొదటి సీజన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండవ సీజన్‌కు అంతగా రెస్పాన్స్ రాకుంటే బ్యాడ్ నేమ్ వస్తుందనే ఉద్దేశ్యంతో ఇలాంటి నిర్ణయంను ఎన్టీఆర్ తీసుకున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.