Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
The TDP Seniors Are Getting On The Capital For Safe Seats.
సీఎం కేసీఆర్ సర్వేలపై ఆయన సొంత పార్టీ నేతలకే నమ్మకం లేదు. ఇదేదో ప్రతిపక్ష నేతల మాట కాదు. సాక్షాత్తూ టీఆర్ఎస్ లో అంతర్గతంగా వినిపిస్తున్న వాదన. అదేంటి అంటారా..? కేసీఆర్ మైండ్ గేమ్ లో భాగంగా విపక్షాలకు ఒక్క సీటు రాదని ఊదరగొడుతున్నారని, వాస్తవానికి అంత సీన్ లేదనీ ఆయనకు తెలుసంటున్నారు గులాబీ నేతలు. దీంతో సీనియర్లంతా సేఫ్ సీట్ల కోసం రాజధానిపై పడుతున్నారట.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అనూహ్యంగా 99 సీట్లు రావడం టీఆర్ఎస్ నేతలకు పండగలా మారింది. అందుకే జిల్లాల్లో తమ నియోజకవర్గాలు గాలికి వదిలేసి.. అందరూ జీహెచ్ఎంసీలో సెటిలర్ ఎమ్మెల్యేలుగా ఉండాలని భావిస్తున్నారట. ముఖ్యంగా కేసీఆర్ సర్వేలో 91 శాతం మార్కులు తెచ్చుకున్న ఆయన కుమారుడు కేటీఆరే.. సిరిసిల్ల వదిలేసి ఉప్పల్ లేదా జూబ్లీహిల్స్ పై దృష్టి పెట్టారు. మరో మంత్రి మహేందర్ రెడ్డి కూడా తాండూరు వదిలేసి శేరిలింగంపల్లిపై పడ్డారు.
సీనియర్ల ఉలికిపాటుకు ప్రధాన కారణం.. ప్రభుత్వంపై వ్యతిరేకతే. సిరిసిల్లలో కేటీఆర్ వల్ల నేతన్నలకు ఒరిగిందేమీ లేదు. ఇక తాండూరుకు మహేందర్ రెడ్డి చేసిన సేవ కూడా ఏమీ లేదు. ఎక్కువ మార్కులు వచ్చినవాళ్లే సీట్లు వెతుక్కుంటే.. తక్కువ వచ్చిన వారి సంగతి వేరే చెప్పక్కర్లేదు. అందుకే 30 శాతం అత్తెసరు మార్కులు తెచ్చుకున్న సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.. ఎల్బీనగర్ కు షిఫ్టవ్వాలని చూస్తున్నారు. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్నట్లు.. సాక్షాత్తూ కేసీఆరే తన నియోజకవర్గం గజ్వేల్ వదిలేసి.. ఆలేర్లో పోటీకి దిగుతారట. ఇదేం చోద్యమని గులాబీ వర్గాలు విస్తుపోతున్నాయి.
మరిన్ని వార్తాలు: