రజనీ పార్టీ ప్రకటన వాయిదా

Rajini likely to announce political entry on birthday

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Rajinikanth is going to the party on his birthday

తమిళనాట విశేష అభిమాన గణం ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్. పుట్టుకతో మహారాష్ట్ర, పెరిగిందంతా కర్ణాటక అయినా.. తమిళనాడులో అసలు తమిళులకు కూడా లేని ఫాలోయింగ్ రజనీ సొంతం. అలాంటి రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు 20 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. కానీ తలైవా మాత్రం నాన్చుతూ వచ్చాడు. ఈసారి మాత్రం సీరియస్ గానే కథ నడిపిస్తున్నాడు. ఇందులో భాగంగా జులైలో రజనీ పార్టీ ప్రకటన ఉంటుందని ఆయన సోదరుడు ప్రెస్ నోట్ విడుదల చేశారు.

కానీ హడావిడిగా రావడం కంటే. పక్కగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని రంగంలోకి దిగాలని రజనీ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే అభిమాన సంఘాలతో విస్తృత సంప్రదింపులు జరిపిన రజనీ. వారికి పలు జాగ్రత్తలు చెప్పారట. ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని, ఏమున్నా తానే ప్రకటిస్తానని చెప్పారు. జూనియర్లు వీరావేశపడి నష్టం చేయొద్దని, సీనియర్ అభిమానులు చెప్పిన మాట వినాలని రజనీ అభిమానులకు నచ్చజెప్పారు.

పార్టీ జెండా, అజెండా వ్యవహారాలపై ఇప్పటికే చర్చలు జరిపిన రజనీ. తన పుట్టినరోజున సరైన ముహూర్తమని భావిస్తున్నారట. మామూలుగానే రజనీ పుట్టినరోజంటే తమిళనాడులో పండగ. ఇక పార్టీ ప్రకటన తోడైతే ఆ ఉత్సాహానికి హద్దు ఉండదు. అందుకే రజనీ ఆ ముహూర్తం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఊహాగానాలే కానీ. రజనీ నోటి నుంచి ప్రకటన వచ్చేవరకూ ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది.

మరిన్ని వార్తలు

జేసీ సారీ చెప్పిందెవరికి?

రాజకీయాలకు బాలయ్య గుడ్ బై?