అయోధ్య కేసులో కీలక తీర్పు ఇచ్చిన సుప్రీం…!

The Trial Of Ayodhya In The Supreme Court Was Postponed To October 29

సుప్రీం కోర్టులో అయోధ్య కేసు విచారణ అక్టోబర్ 29కి వాయిదా పడింది. 1994 నాటి ఎం ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో తీర్పు దీనికి వర్తించబోదని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసే అవసరం లేదని తేల్చింది త్రిసభ్య బెంచ్. ఇకపై త్రిసభ్య బెంచ్‌లోనే విచారణ జరగనున్నట్టు సభ్యులు తెలిపారు. అలాగే మసీదులో నమాజ్ చేయడమనేది ఇస్లాంలో అంతర్భాగం కాదని 1994లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.

supreem-court

ప్రార్థనా స్థలాలకు ఆయా మతాల్లో ప్రత్యేక స్థానముంటుందని.. అన్ని మతాలు సమానమేనని వ్యాఖ్యానించింది. మసీదులు ఇస్లాంలో అంతర్భాగమా కాదా అనే అంశంపై కూడా సుప్రీం కోర్టు విచారణ చేస్తుందని తెలిపింది. 1994 నాటి ఎం ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో తీర్పు దీనికి వర్తించబోదని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ కేసుకు సంబంధించి 1994లో ఇచ్చిన ఆదేశాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ ధర్మాసనం 2:1 మెజారిటీ తీర్పునిచ్చింది. జస్టిస్ నజీర్ అసమ్మతి తీర్పునిచ్చారు. అయోధ్య రామజన్మభూమి హక్కుల వివాదంపై తదుపరి విచారణను వచ్చే నెల 29కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

ayodhaya