చైనా బ్రౌజర్ తో ముప్పు తప్పదా..?

the-use-of-the-uc-browser-has-been-shifted-to-china-as-a-secret

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భారత్, చైనా మధ్య టెన్షన్ పెరిగిన తరుణంలో.. చైనా సేవలపై ఇండియా కన్నేసింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో చైనాకు మేజర్ షేర్ ఉంది కాబట్టి.. చైనా ఫోన్లలో ఉన్న ఫీచర్స్, యాప్ ల సేఫ్టీపై కేంద్రం దృష్టి పెట్టింది. ముఖ్యంగా చైనా ఫోన్లలో యూసీ బ్రౌజర్ తో మన వినియోగదారుల సమాచారం డ్రాగన్ కు చేరవేస్తున్నారనే సమాచారం కేంద్రానికి ఉంది.

యుద్ధం వస్తే ముందుజాగ్రత్త కోసం మన సమాచారమంతా చైనా సేకరించడం కేంద్ర పెద్దలకు సుతరామూ ఇష్టం లేదు. అందుకే వినియోగదారుల డేటా సేఫ్టీకి ఏం చర్యలు తీసుకుంటున్నారని మొబైల్ కంపెనీలను కేంద్రం ప్రశ్నించింది. నిర్ణీత కాలవ్యవధిలో తమకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు కంపెనీలు ఇచ్చే వివరణ తర్వాత విచారణ జరిపి అసలు విషయం తేల్చనున్నారు.

ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న యూజర్లందరూ యూసీ బ్రౌజర్ వాడుతున్నారు. ఈ బ్రౌజర్ ను ఉపయోగించే వారి డేటా అంతా సీక్రెట్ గా చైనాకు తరలివెళ్లిపోతోందట. అందుకే యూసీ బ్రౌజర్ సేఫ్టీపై కేంద్రం సందేహాలు లేవనెత్తుతోంది. మొబైల్ కంపెనీలు వివరణ ఇచ్చేలోపే సైబర్ భద్రతా నిపుణులతో కేంద్రం కూడా విచారణ చేయించనుంది.

మరిన్ని వార్తలు:

పేరుకే అగ్రరాజ్యం.. సెక్యూరిటీకి జీతాల్లేవ్