విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. కేవలం వారం రోజుల్లోనే ఈ చిత్రం 50 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూళ్లు చేసిన ఈ చిత్రం తాజాగా 75 కోట్లను వసూళ్లు చేసింది. విజయ్ దేవరకొండ గత చిత్రం అర్జున్ రెడ్డి స్థాయిలో ఈచిత్రం వసూళ్లు చేస్తుందా అని అంతా విడుదలకు ముందు అనుకున్నారు. కాని ఈ చిత్రం అర్జున్ రెడ్డి చిత్రాన్ని కేవలం రెండు వారాల లోపులోనే క్రాస్ చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొంది, ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా ఈ చిత్రం ఉండటంతో భారీ స్థాయిలో వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ చిత్రం పెద్ద ఎత్తున వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో నిర్మాతల పంట పండినది.
ఈ చిత్రంను 20 కోట్ల లోపు బడ్జెట్‌తో బన్నీ వాసు ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో నిర్మించాడు. చిత్ర బడ్జెట్‌కు దాదాపుగా మూడు రెట్ల లాభం దక్కనున్నట్లుగా లెక్కలు చెబుతున్నారు. లాంగ్ రన్‌లో ఈ చిత్రం 50 కోట్ల షేర్‌ను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ మరియు ప్రైమ్ వీడియో రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోయింది. మొత్తంగా ఈ చిత్రం 65 కోట్ల వరకు నిర్మాత ఖాతాలో పడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో భారీ ఎత్తున క్రేజ్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇంతటి సంచలన విజయాన్ని దక్కించుకున్న ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ తీసుకున్న పారితోషికం కేవలం 40 లక్షల రూపాయలు మాత్రమే.