Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Third Teaser Release On Ntr Big Boss Show
ఎన్టీఆర్ హోస్ట్‌గా స్టార్ మాటీవీలో ప్రసారం కాబోతున్న బిగ్‌బాస్ షో కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పేందుకు ఒక టీజర్‌ను వదిలారు. ఆ తర్వాత ఎన్టీఆర్ బెడ్ చుట్టు కెమెరాలు పెట్టినట్లుగా ఒక టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మూడవ టీజర్‌ను తీసుకురాబోతున్నారు. ఈ షోలో పాల్గొనబోతున్న సెలబ్రెటీలతో ఎన్టీఆర్‌ను కలిసి ఒక వీడియోను షూట్ చేయడం జరిగిందట. ‘బాహుబలి’ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్‌ను అందించిన టీం ‘బిగ్ బాస్’ లేటెస్ట్ టీజర్‌కు విజువల్ ఎఫెక్ట్స్‌ను అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.
స్టార్ మాటీవీ వారు ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఆ టీజర్ విడుదలతో షోపై ప్రేక్షకులకు ఫుల్ క్లారిటీ వస్తుందని అంతా అంటున్నారు. భారీ అంచనాలున్న ఈ షో ఎప్పుడెప్పుడు ప్రసారం మొదలవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ ఇప్పటికే హిందీలో సూపర్ హిట్ అయ్యింది. తమిళంలో ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతుంది. తెలుగులో వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. ఎన్టీఆర్ ఈ షోతో బుల్లి తెరను షేక్ చేయడం ఖాయంగా భావిస్తున్నారు.
మరిన్ని వార్తలు