ఆదివారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సమక్షంలో విజయవాడ-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మూడవ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు ప్రధాన దక్షిణాది రాజధానులైన విజయవాడ మరియు చెన్నై మధ్య రైలు, పవిత్ర ఆలయ పట్టణమైన తిరుపతిని (రేణిగుంట మీదుగా)( ప్రజలకు చిరకాల వాంఛ) కలుపుతూ సాగుతుంది. అలాగే, ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు మధ్య మొదటి వందే భారత్ రైలు.