Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : వరుణ్ తేజ్, రాశి ఖన్నా
నిర్మాత: బి. వి. ఎస్.ఎన్ ప్రసాద్
దర్శకత్వం : అట్లూరి
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్
ఎడిటర్ : నవీన్ నూలి
మ్యూజిక్ : తమన్
పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రాల్లో తొలిప్రేమ ఒకటి. అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న తొలిప్రేమ పవన్ కెరీర్‌ను టర్న్ చేసింది. ఎన్నో కొత్త తరహా ప్రేమ కథలకు ఆ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్లో అంతటి క్రేజ్ ఉన్న ‘తొలిప్రేమ’ టైటిల్‌తో అదే స్థాయిలో వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కింది. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. రేపు అంటే ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘తొలిప్రేమ’పై సినీ వర్గాల్లో మరియు మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి.
‘తొలిప్రేమ’లో వరుణ్ తేజ్ లుక్ మరియు రాశిఖన్నా గ్లామర్ సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ఇలా అన్ని విధాలుగా కూడా సినిమాపై పాజిటివ్ టాక్‌ను చిత్ర యూనిట్ సభ్యులు క్రియేట్ చేశారు. ఇలాంటి సినిమా కోసం యూత్ ఆడియన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఒక క్యూట్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ‘తొలిప్రేమ’ ఖచ్చితంగా టైటిల్‌కు తగ్గ సక్సెస్‌ను అందుకుంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంతో వరుణ్ తేజ్ మరో కమర్షియల్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన విషయం తెల్సిందే. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను అంచనాలను అందుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. సినిమా ఫలితంపై మరి కొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.