Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ కారు ఆక్సిడెంట్ కు గురయ్యింది. విజయవాడలో జరుగుతున్న మహానాడులో పాల్గొనేందుకు ఆమె తన కారులో విజయవాడకి వచ్చారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల వేదికగా జరుగుతున్న మహానాడులో పాల్గొనేందుకు ఆమె తన కారులో వెళ్తుండగా బెంజి సర్కిల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే కారు, పరస్పరం ఆటో ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో, వెంటనే సమీప ఆసుపత్రికి ఆమెను తరలించి వైద్య చికిత్స అందించారు. ప్రమాదంలో గాయపడ్డ సుగుణమ్మను పలువురు నేతలు పరామర్శించారు. మహానాడులో పాల్గొనేందుకు వస్తున్న బాపట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తోట మహాలక్ష్మి కారు కూడా నిన్న ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మహాలక్ష్మి భర్త నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి.