నేడు పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం..

ఆంధ్రప్రదేశ్ లోని కోదండ రాముడు వెండి వెన్నెలలో సీతమ్మని ఈ రోజు పరిణయం చేసుకోనున్నాడు. ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. సీతారాములకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు దుస్తులను సమర్పించనున్నారు. సిఎం కుటుంబ సమేతంగా వస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు రామయ్య కల్యాణం సందర్భంగా శీవారి తరపున టీటీడీ భారీ కానుకలను పంపింది.