ఆ జ్యూస్ తాగితే డ్రగ్స్ కేసు నుంచి రిలీఫ్ ?

tollywood Celebrities Drinking Aloe Vera Juice Before Coming to SIT

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణాలో సాగుతున్న డ్రగ్స్ కేసు విచారణ తెలుగు రాష్ట్రాల్లోనే గాక మొత్తం యావద్దేశం లో చర్చకి దారి తీసింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీ లు ఇందులో ఇరుక్కోవడంతో అందరి దృష్టి ఇటు పడింది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, కేసులో ఇరుక్కున్న వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళయినా వదిలి పెట్టేది లేదని ఇటు అధికారులు, అటు మంత్రులు హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో కొందరు సెలెబ్రెటీలు వణికిపోతున్నారు. ఇంకొందరు మాత్రం పెద్దగా టెన్షన్ లేకుండా విచారణకు వచ్చి వెళుతున్నారు. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా బ్లడ్, నెయిల్, హెయిర్ శాంపిల్ ఇచ్చి వెళుతున్నారు. దీంతో పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. తప్పు చేసినట్టు గట్టి ఆధారాలు వున్న వాళ్ళు కూడా ఇంత ధైర్యంగా శాంపిల్ ఎలా ఇస్తున్నారో అర్ధం గాక తలలు పట్టుకుంటున్నారు.అయితే వాళ్ళ ధైర్యం వెనుక వున్నది పెద్ద తలకాయలు కాదట. కేవలం ఓ జ్యూస్ మాత్రమే ఈ ధైర్యానికి కారణం అని తెలుస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది నిజం.

డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వాళ్లంతా దాన్నుంచి తప్పించుకోడానికి దారులు వెదుక్కోవడం సహజమే. ఆ ప్రాసెస్ లో వారికి అలోవెరా జ్యూస్ వారికి ఓ వరం లా దొరికిందట. అలోవెరా జ్యూస్ తాగాక బ్లడ్ శాంపిల్ ఇచ్చినప్పటికీ టెస్టుల్లో డ్రగ్ ఆనవాళ్లు బయటపడవని కొందరు ఇచ్చిన సలహాని పాటిస్తున్నారు. ఈ సలహాతో ఎంత ప్రయోజనం వుందో శాస్త్రీయంగా తెలియకపోయినప్పటికీ దాన్ని పాటిస్తూ డ్రగ్స్ కేసు నుంచి దొరక్కుండా తప్పించుకుంటామని భావిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ సలహా ఒకరి నుంచి ఇంకోరికి వెళ్లి డ్రగ్స్ కేసు విచారణకి వెళ్లే వాళ్లంతా అలోవెరా జ్యూస్ తాగి వెళుతున్నారట. ఔను మరి కష్టాల్లో వున్నప్పుడు గడ్డిపోచ దొరికినా దానిపై ఆధారపడటం సహజమే కదా!

మరిన్ని వార్తలు

ఛార్మీ ఏంటీ రచ్చ..?

హీరోయిన్స్‌కు డ్రగ్స్‌ అలవాటు చేసి పూరి వారిని వాడుకుంటాడట!

రాము, సోము కలిసి రాత మార్చేస్తారా..?