తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు…!

Tollywood celebrities
Tollywood celebrities

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్.కొంతమంది సెలబ్రిటీలు వారితో నటించిన తోటి నటీనటులనే ప్రేమించి వివాహాలు చేసుకుంటారు. కొంతమంది కుటుంబ సభ్యులను ఒప్పించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సెలబ్రిటీలు ఉన్నారు. ఇక మరికొందరేమో ఇంట్లో వారికి చెప్పకుండా సీక్రెట్ గా వివాహం చేసుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అయితే వీరు సీక్రెట్ గా వివాహం చేసుకోవడానికి కారణం వారి కుటంబం సభ్యులు వారి ప్రేమను అంగీకరించకపోవడం. దింతో వారు ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు. అయితే ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

మహేష్ బాబు – నమ్రత : స్టార్ హీరో మహేష్ బాబు, నమ్రత ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది దింతో వివాహం చేసుకోవాలని ఈ కుటుంబ సభ్యులకి విషయాన్ని చెప్పారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వీరు ముంబైలో వివాహం చేసుకున్నారు.

సూర్య – జ్యోతిక : హీరో సూర్య జ్యోతికని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగారు. వీరిద్దరూ ప్రేమిచుకుని వారి ప్రేమ విషయాన్ని కుటంబ సభ్యులకు చెప్పడంతో సూర్య తండ్రి వివాహాన్ని ఒప్పుకోలేదట. దీంతో వీరిద్దరూ సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు. దాంతో చేసేదేమీలేక కుటుంబ సభ్యులు మళ్ళీ వీరి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు.

దేవయాని – రాజకుమార్ : హీరోయిన్ దేవయాని డైరెక్టర్ రాజశేఖర్ ని వివాహం చేసుకుంటానని తన కుటుంబ సభ్యులతో చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు. ఇక ప్రసుతం చాలా అందంగా వీరు జీవితాన్ని గడుపుతున్నారు

అక్కినేని నాగార్జున – అమల : నాగార్జున అమల ఒక సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.అక్కినేని నాగార్జున నాగశ్వరరావుతో అమలను వివాహం చేసుకుంటానని చెప్పాడంతో వీరి వివాహన్ని అతను ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహమైన నాగేశ్వరరావు అమలని కోడలుగా ఇష్టపడలేదట. ఇక అఖిల్ పుట్టిన అనంతరం తర్వత అమల ని కోడలిగా ఒప్పుకున్నారు .