దర్శకుడు క్రిష్ వచ్చే ఏడాది చాలా స్పెషల్ ని చెప్పుకోవాలి. ఎందుకంటే తను దర్శకత్వం వహిస్తున్నా ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రెండు నెలల గ్యాప్ లోనే విడుదలవుతుంది. అలాగే బాలీవుడ్ లో మణికర్ణిక చిత్రాని క్రిష్ సగభాగం వరకు రూపొందించి కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమాను వదిలేసి వచ్చాడు. ఇప్పుడు ఆ చిత్రం కుడా సంక్రాంతి కి విడుదలవుతుంది. సినిమా చరిత్రలోనే ఒకేసారి మూడు చిత్రాలు విడుదలవ్వడం ఏ డైరెక్టర్ కి జరగలేదు. జనవరి 9 నుండి ఫిబ్రవరి 9 మద్యలో ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు అండ్ మణికర్ణిక విడుదలవుతున్నాయి. మణికర్ణిక విషయంలో క్రిష్ చాలా దూరంగా ఉంటున్నాడు. క్రిష్ వదిలేసినా ఆ చిత్రాని కంగన పూర్తి చేసింది ఆ విషయాని మీడియా సమక్షంలో కంగన్ చెప్పుకుంటూ వస్తుంది. కానీ క్రిష్ మాత్రం స్పందించడం లేదు.
కంగన తను ఇచ్చిన స్టేట్మెంట్స్ ద్వార నిప్పు రాజేసే ప్రయత్నం చేస్తుంది అది ముందే గ్రహించిన క్రిష్ తను నిర్మించిన అంతరిక్షం సినిమా పనులతో బిజీగా ఉన్నాడు అలగే బాలకృష్ణ తో తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ పనులు చూసుకుంటున్నాడు. క్రిష్ కి కంగన సంగతి భాగా తెలుసు ఆమె ఇంతకుముందు. తను వెడ్స్ మను సినిమా టైములో సినిమా వారసుల మిధ విరుచుకుపడి తను మీడియా లో ఫోకస్ అయ్యింది. అలాగే హృతిక్ రోషన్ తో సిమ్రాన్ సినిమా టైం లో గొడవకు పడి తన పేరును మారుమ్రోగేల చేసుకుంది. మరో సారి అలాంటి ప్రయత్నం చెయ్యాలని ప్లాన్ చేసింది కానీ క్రిష్ మాత్రం తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు.