రొటీన్ కథలు చేస్తుంటే ప్రేక్షకులు కూడా పట్టించుకోవడం మానేస్తారు. దానికి తోడు వరుస ఫ్లాపులు కూడా వచ్చాయంటే కెరీర్ ఖతం అయిపోతుంది. ప్రేమకావాలి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత ఒక్క హిట్ కూడా కొట్టలేదు ఆది సాయి కుమార్. మధ్యలో చాలా మంది దర్శకులు ఆయనతో సినిమాలు చేసినా కూడా ఏ ఒక్కటి అనుకున్న ఫలితం అందించలేదు. చివరికి కెరీర్ క్లోజ్ అయిపోతుంది అనుకుంటున్న ఈ సమయంలో ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఆది. అలా వస్తున్న సినిమా పేరు బుర్రకథ. ఒకప్పుడు బుర్రకథ అంటే వేరే అర్థం ఉండేది కానీ ఈ సినిమాలో బుర్రకథ అంటే మాత్రం బ్రెయిన్ స్టోరీ అని అర్థం. బుర్ర అంటే మెదడు దానికి ఉన్న కథే ఈ బుర్రకథ. సాధారణంగా మనిషిలో ఒక మెదడు ఉంటుంది. కానీ ఈ సినిమాలో హీరోకు రెండు మెదళ్ళు ఉంటాయి. దానివల్ల అతనికి వచ్చిన సమస్యలేంటి అతని జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏంటి అనే నేపథ్యంలో ఈ బుర్ర కథ కథ రాసుకున్నాడు దర్శకుడు డైమండ్ రత్నబాబు. ఎన్నిరోజులు రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైమండ్ రత్నబాబు ఇప్పుడు దర్శకుడిగా మారి సత్తా చూపించాలి అనుకుంటున్నాడు. ఒకే మనిషిలో రెండు మెదళ్లు ఉంటే వచ్చే సమస్యలు అనేది ఈ చిత్ర కథ. గతేడాది సవ్యసాచి లో నాగచైతన్యలో ఒకే మనిషిలో ఇద్దరు మనుషుల ఆలోచనలు ఉంటాయి. అతని ఎడమ చేయి ఆధీనంలో ఉండదు. ఇప్పుడు అచ్చంగా ఇలాగే బుర్రకథలు రెండు మెదళ్ళు ఉండటంతో ఒకే మనిషిలో ఇద్దరు రెండు రకాలుగా ఆలోచిస్తుంటారు. జూన్ 28న బుర్రకథ విడుదల కానుంది,
బుర్రకథ ట్రైలర్…ఆది హిట్ కొట్టేట్టుఉన్నాడు
https://www.youtube.com/watch?v=7B6Syq2wxlM