ఏపీ పాలనలో తనదైన ముద్ర వేసుకోవాలని చూసున్న సీఎం వైఎస్ జగన్, అందుకు అనుగుణంగా పనిచేసే అధిఅకారులని కూడా నియమించుకుంటున్నారు. ఆయన ప్రమాణం స్వీకారం తర్వాత రోజే చాలా మంది తన అనుకూలా అధికారులని నియమించుకున్న ఆయన నిన్న ఒక్కదెబ్బకి దాదాపు 47 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. ఒక రకంగా ఇది ఏపీ లోనే భారీ సంఖ్యలో జరిగిన ఐఏఎస్‌ల బదిలీ అని చెప్పొచ్చు. 47 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ తెల్లవారు జామున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సాధారణ పరిపాలన శాఖకు పంపిన వారికి ఈసారి పోస్టింగ్‌లు ఇచ్చింది. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా మద్దాడ రవిచంద్రను నియమించగా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనాను నియమించింది. ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్స్ ఎండీగా వాణీమోహన్, కార్మిక శాఖ కమిషనర్‌గా డి.వరప్రసాద్, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా భానుప్రకాశ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్‌గా హెచ్.అరుణ్ కుమార్, ఏపీ టూరిజం అథారిటీ ఎండీగా ప్రవీణ్ కుమార్, విపత్తు నిర్వహణశాఖ స్పెషల్ కమిషనర్‌గా కె.కన్నబాబు, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శిగా బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా వై.మధుసూదన్‌రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కార్మిక ఉపాధి కల్పన, శిక్షణ ముఖ్య కార్యదర్శిగా బి.ఉదయ లక్ష్మి, ఇంటర్ బోర్డు కమిషనర్‌గా కాంతిలాల్ దండేను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.