అభిమానిపై ఆగ్రహించిన త్రిష

Trisha slams her fan

తెలుగు మరియు తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ త్రిష. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో రెండు వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో ఈమె మెల్ల మెల్లగా ఫేడ్‌ ఔట్‌ అవుతోంది. కాని తమిళంలో మాత్రం ఈమెకు ఇంకా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రంలో త్రిష హీరోయిన్‌గా ఎంపిక అయిన విషయం తెల్సిందే. ఆ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇక త్రిష తాజాగా విజయ్‌ సేతుపతితో కలిసి నటించిన ‘96’ చిత్రం విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా త్రిష చాలా బిజీగా ఉంటుంది. ఈ సమయంలోనే త్రిష సోషల్‌ మీడియా ద్వారా కూడా అభిమానులకు దగ్గరగా ఉంటూ సినిమాను ప్రమోట్‌ చేసుకుంటుంది.

Trisha slams her fan

తాజాగా సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్‌ చాట్‌ చేస్తున్న సమయంలో త్రిష వీరాభిమాని ఒకడు ఇతర స్టార్‌ గురించి తప్పు అర్థం వచ్చేలా, బూతులు మాట్లాడాడు. దాంతో త్రిష తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. నా టైం లైన్‌లో ప్రవేశించి, ఇతరులను కించపర్చే విధంగా, అగౌరవ పర్చే విధంగా మాట్లాడటం ఏంటీ అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. ఇలా ముందు ముందు జరిగితే బ్లాక్‌ చేస్తాను అంటూ హెచ్చరించింది. త్రిష మెప్పు పొందేందుకు ఆ అభిమాని ఇతర స్టార్‌ను విమర్శించాడు. కాని అది కాస్త అతడికే దెబ్బ తలిగేలా చేసింది. త్రిష తన టైం లైన్‌లో ఇతరు గురించి కామెంట్స్‌ చేస్తే అస్సలు ఊరుకోదు. గతంలో కూడా తన పోస్ట్‌లకు తప్పుడు కామెంట్స్‌ చేసిన వారిపై చాలా సీరియస్‌ అయిన విషయం తెల్సిందే.

trisha