Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మొన్నటిదాకా దీపా జయకుమార్ మీద తమిళ ప్రజలకు ఓ రకమైన సానుభూతి ఉండేది. కానీ వేద నిలయంపై ఆమె చేసిన ప్రకటనతో అది కాస్తా పోయింది. అమ్మ నివసించిన ఇంటిని స్మారక మందిరం చేస్తామని ప్రభుత్వం ముందుకొస్తే.. ఆ ఇంటిపై సర్వహక్కులు తనకే ఉన్నాయని దీప చేస్తున్న వాదనతో ఎవరూ ఏకీభవించడం లేదు. దీప అనవసర వివాదం తెస్తున్నారని అందరూ అనుకుంటున్నారు.
దీప, ఆమె సోదరుడు కూడా ఇంతకాలం అమ్మ కోసం తాపత్రయపడ్డారని భావించిన వాళ్లు కూడా ఆస్తి కోసమే వారసత్వం కోసం పోటీపడ్డారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. తమిళ ప్రజల గుండెల్లో అమ్మగా కొలువైన జయలలిత బుద్ధిలో కొంచెమైనా వీళ్లకు రాలేదని వాపోతున్నారు జనం. ఇలాంటి వారసులు కాబట్టే వీళ్లను జయలలిత దూరం పెట్టారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు వేదనిలయం వారసత్వ వివాదంపై స్పందించిన ప్రభుత్వం.. చట్టబద్దమైన వారసులుంటే పరిహారం ఇస్తామని ప్రకటించింది. మరి వాళ్లెంతిస్తారు. వీళ్లెంత అడుగుతున్నారనేది కూడా చర్చకు దారితీస్తోంది. అవసరమైతే కేంద్రం రంగంలోకి దిగి సమస్య పరిష్కరించే సూచనలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి వేద నిలయం స్మారకమందిరంగా మారడానికి ఇంకా ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయో
మరిన్ని వార్తలు: