వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితికి రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఇప్పుడు ఫిల్టర్ లా మారింది. ఎందుకంటే లోక్ సభలో బిల్లు యిట్టె పాస్ అయ్యింది, లోక్‌సభలో ఎన్డీఏకి సంపూర్ణ మెజార్టీ ఉండటంతో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆమోదం లభించింది. దీనిపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రవేశపెట్టిన మూడు సవరణలూ కూడా వీగిపోయాయి. రాజ్యసభలో అధికార పార్టీకి తగినంత బలం లేకపోవడంతో ఈ బిల్లు ఆమోదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ బిల్లు పాలవ్వాలంటే ఎన్డీఏకు కచ్చితంగా టీఆర్ఎస్, వైసీపీ లాంటి చాల పార్టీల సహకారం అవసరం. నేరుగా మద్దతిస్తే సమస్యే లేదు కనీసం వాకౌట్ అయినా చేసి సహకరించాలి.
కానీ తెరాస, వైసీపీ ఈ రెండింటిలో ఏదీ చేసినా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముస్లిం వర్గం ఆ వర్గం ఓటర్ల సంగతి పక్కన పెట్టినా బీజేపీకి సహకరించారనే పేరు మాత్రం ఎన్నికలకు ముందు ముద్రలా పడిపోతుంది. అయితే కేసీఆర్‌కు ఇప్పటి వరకూ ఫెడరల్ ఫ్రంట్ తరపున ఉన్న ఒకే ఒక్క మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన లోక్‌సభ చర్చ సందర్భంగా కొన్ని సవరణలు పెట్టారు. కానీ అవి కూడా వీగిపోయాయి. లోక్‌సభలో అయితే ఈ బిల్లును టీఆర్ఎస్ వ్యతిరేకించింది. కానీ ఓటింగ్‌ను మాత్రం వాకౌట్ చేసింది. టీఆర్ఎస్ ఇలా లోక్‌సభలో ఓటింగ్‌కు గైర్హాజర్ కావడం వల్ల బీజేపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. కానీ రాజ్యసభలో మాత్రం పరిస్థితి వేరేగా ఉంది. అక్కడ బిల్లును కచ్చితంగా వ్యతిరేకించాలి. వ్యతిరేకిస్తే సరిపోదు వ్యతిరేకంగా ఓటు వేయాలి. తెలివి ప్రదర్శించి వాకౌట్ చేస్తే. అది బిల్లు పాసవ్వడానికి పరోక్షంగా సహకారం అందించినట్లవుతుంది. ఓవైసీ ఎలాగూ అంగీకరిస్తారు కానీ కేసీఆర్‌కు మాత్రం ముస్లిం ఓటు బ్యాంకులో కోత పడుతుంది. వైసీపీ పరిస్థితి కూడా దాదాపు అదే అనమాట.