Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమను తాము ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలో టీఆర్ఎశ్ నేతలకు తెలిసినట్లు ఎవరికీ తెలియదు. పైకి కేసీఆఱ్, కేటీఆఱ్ మీడియాకు దూరంగా ఉన్నట్లే ఉంటారు. కానీ వారికి సంబంధించిన వార్తలన్నీ విస్తృతంగా కవర్ అయిపోతాయి. అదే మీడియా అండర్ కవర్ మేనేజ్ మెంట్. ఇప్పుడు కేటీఆర్ బర్త్ డే రోజు కూడా గులాబీ నేతలు పోటీపడి కేటీఆర్ భజన చేశారు.
ఇతర నేతల్లా కేటీఆర్ తేరగా పదవుల్లోకి రాలేదని, ఉద్యమంలో కష్టపడి పైకొచ్చారని కితాబిచ్చారు. అసలు కేసీఆర్ ఇష్టంతో కేటీఆర్ ఎమ్మెల్యే కాలేదని, ఆయన వద్దంటున్నా వినకుండా ఈ ఫీల్డ్ కు వచ్చారని తెలిపి అందరికీ హోల్ సేల్ గా చెవిలో పువ్వెట్టారు. తన కొడుక్కి సేఫ్ నియోజకవర్గాన్ని స్వయంగా కేసీఆర్ వెతికితే వీళ్లు ఈ రకంగా అబద్ధాలు చెప్పడమేంటని ప్రత్యర్థులు మండిపడుతున్నారు.
అన్నింటికంటే పెద్ద కామెడీ ఏంటంటే.. కేటీఆర్ కు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వని రోజులున్నాయంట. అయినా కుమారుడికి అపాయింట్ మెంట్ ఇవ్వాల్సిన పనేముంది. ఉండేది ఒకే్ ఇంట్లో కదా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. కానీ గులాబీ నేతలు మాత్రం జనాలు పిచ్చోళ్లనుకుని నోటికి ఏదొస్తే అధి మాట్లాడుతున్నారు.
మరిన్ని వార్తలు