Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అసలు తెలంగాణ వస్తుందో.. రాదో తెలియని పరిస్థితి నుంచి.. టీఆర్ఎస్ తిరుగులేని అధికారం చెలాయించేవరకు పద్నాలుగేళ్ల పాటు వారు పార్టీ జెండా మోశారు. అయినా సరే పదవుల పంపకంలో మాత్రం బాగా వెనుకపడిపోయారు. టీఆర్ఎస్ లో ముందు నుంచీ ఉన్న ఉద్యమకారులకు ఇప్పుడు విలువే లేదు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారు పెత్తనం చేస్తుంటే నోర్మూసుకుని ఉండాల్సిన పరిస్థితి.
అయితే పిల్లినైనా ఇంట్లో పెట్టి కొడితే పులైతే.. ఎప్పట్నుంచో రగులుకుంటున్న అసంతృప్తి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీ సమావేశంలో భగ్గుమంది. కాంగ్రెస్, వైసీపీ నుంచి వచ్చిన నేతలు ఆర్డర్లు వేస్తుంటే తామెందుకు సేవలు చేయాలని టీఆర్ఎస్ ఉద్యమ కార్యకర్తలు మొండికేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కుర్చీల యుద్ధం నడిచింది. చివరకు జోక్యం చేసుకున్న జిల్లా అధ్యక్షుడు సీనియర్ నేత బేగ్ పక్క పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండబాల వెంకటేశ్వర్రావు, తుమ్మల నాగేశ్వర్రావు ఉన్న మీటింగ్ లో ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపింది. చివరకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షమాపణ చెప్పడంతో కథ సద్దుమణిగింది. అయితే ఇంకా ఇలాంటి అసంతృప్తులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయని, అవి ఎప్పుడోసారి బ్లాస్ట్ అవుతాయని కేసీఆర్ కు అలజడి మొదలైంది.
మరిన్ని వార్తలు: