Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా చేయి పట్టుకున్నాడన్న కారణంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ అందరికీ టార్గెట్ అయ్యారు. అయితే శంకర్ నాయక్ కు లూజు టంగ్ కూడా ఉందని, ఇప్పటికే ఒకటికి, రెండు సార్లు అలా అందరి సమక్షంలో బుక్కయ్యారనే చర్చ జరుగుతోంది. అదే నిజమైతే నాయక్ కు మళ్లీ టికెట్ దక్కడం కలేనని గులాబీ వర్గాలు అంటున్నాయి.
మహబూబాబాద్ ఎమ్మెల్యే సీటు కోసం రెడ్యానాయక్ కూతురు కవిత, ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, ఎంపీ సీతారాం నాయక్ ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరిలో ఎవర్నీ కాదనలేని పరిస్థితి కేసీఆర్ ది. అందుకే ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారని సర్వేలు చేయిస్తున్నారట. ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనంతట తానుగా ఇరుక్కోవడంతో ఎవరూ ఏం చేయలేరని భావిస్తున్నారు.
మరోవైపు ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు గా భావిస్తోంది శంకర్ నాయక్ వర్గం. తమ నాయకుడికి టికెట్ రాదన్న ప్రచారం. సోషల్ మీడియోలో మాలోత్ కవిత ప్రచారంతో నాయక్ బ్యాచ్ అలర్టయ్యారు. కానీ ఎంత అప్రమత్తమైనా కేసీఆర్ ఎమ్మెల్యేపై ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు చాలా మంది లీడర్లు రెడీగా ఉండటంతో.. కలెక్టర్ ఎపిసోడ్ లో ఎమ్మెల్యేకు వెంటనే వార్నింగ్ ఇచ్చారు. ఇఫ్పుడు ఏకంగా సస్పెండ్ చేస్తే.. గొడవకు ఫుల్ స్టాప్ పడుతుందని , పార్టీ మైలైజ్ పెరుగుతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు.
క్రమశిక్షణ వ్యవహారాలపై అధికార టీఆర్ ఎస్ పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మహబూబాబాద్ మహిళా కలెక్టర్ చేయి పట్టుకుని వివాదాస్పద రీతిలో
మరిన్ని వార్తలు: