Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా అంటే అవకాశాల స్వర్గం. కానీ ట్రంప్ వచ్చాక పరిస్థితి మారిపోయింది. వీసాలపై ఆంక్షల నరకంగా తిప్పి చదువుకోవాల్సి వస్తోంది. విదేశీయుల కారణంగానే స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదన్న సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన ట్రంప్.. ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా విదేశీయులపై కఠినమైన ఆంక్షలు అమలుచేస్తున్నారు. ఇప్పటివరకూ హెచ్ వన్ బీ వీసాలపై పడ్డ ట్రంప్.. ఇప్పుడు డ్రీమర్స్ ను కూడా గెంటేస్తున్నారు.
పసితనంలో అక్రమంగా అమెరికాలో చొరబడ్డ చిన్నారులకు రక్షణ కల్పిస్తూ ఒబామా తెచ్చిన బిల్లును చెత్తబుట్టలో పడేయాలంటున్నారు ట్రంప్. దాని స్థానంలో కఠినమైన ఆంక్షలతో కొత్త బిల్లు రెడీ అవుతోంది. ఈ బిల్లు ప్రకారం చిన్నప్పుడే అక్రమంగా దేశంలో చొరబడ్డ వారికి.. పెద్దయ్యాక ఉద్యోగాలు చేసే అవకాశం ఉండదు.
డిఫర్ట్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ ప్రోగ్రామ్ కింద ఒబామా ఇచ్చిన వెసులుబాటును తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని దేశాల నుంచి వచ్చిన మేధావుల కృషితో ఎదిగిన అమెరికా.. ఇప్పుడు స్థానికతను నిర్వచించడం విడ్డూరంగా ఉందంటున్నారు స్టార్టప్ సీఈవోలు. అమెరికన్లు ఒక జాతి కాదని, అదో నానా జాతి సమితి అనే వాదనలున్నాయి. కానీ ఎవరేం చెప్పినా ట్రంప్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.
మరిన్ని వార్తలు: