కేసీఆర్ చీరలు… కొత్త రికార్డు

ts-govt-to-distribute-1-crore-sarees-on-bathukamma-festival

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో చీరలు పంచాలని తెలంగాణ సీఎం డిసైడయ్యారు. బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణలో 1 కోటి నాలుగు నలభై లక్షల చీరలు పంచాలని ఆయన డిసైడయ్యారు. రంజాన్, క్రిస్మస్ ఆ మతాల వారికే దుస్తులిచ్చిన కేసీఆర్.. బతుకమ్మ పండగకు మాత్రం ఆడబిడ్డలందరికీ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే రేషన్ దుకాణాల్లో మూడు రోజుల పాటు చీరల పంపిణీ జరగనుంది. ఇప్పట్నుంచే చేనేత శాఖ కార్మికులతో చీరలు నేయిస్తోంది. తద్వారా వారికి ఉపాధితో పాటు జనానికి చీరలిచ్చిన సంతృప్తి తమకు దక్కుతుందని గులాబీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే చీరల శాంపిల్ చూసి ఓకే చేసిన కేసీఆర్.. అదే నాణ్యతతో అన్నీ రెడీ చేయాలని చెప్పారట.

బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించిన కేసీఆర్.. ఆరోజు ఈ భారీ కార్యక్రమానికి పూనుకున్నారట. పార్టీలో ఔత్సాహికులు లిమ్కా బుక్, ఇండియా బుక్, గిన్నిస్ బుక్ ప్రతినిధుల్ని కూడా పిలుస్తున్నారట. ఈ కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహించి మహిళా ఓట్లన్నీ ఒడిసిపట్టాలనేది టీఆర్ఎస్ ఆలోచనగా ఉంది. కేసీఆర్ స్కీములు చూసి ప్రతిపక్షాలకు నోట మాట రావడం లేదు.

మరిన్ని వార్తలు:

కలెక్టర్ కాదట దేవత

ఇద్దరు మిత్రులు ప్రత్యర్థులైనట్లే