TTD: డిసెంబర్‌ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 116.7 కోట్లు

TTD: In the month of December, the income of Srivari Hundi was Rs. 116.7 crores
TTD: In the month of December, the income of Srivari Hundi was Rs. 116.7 crores

ప్రతి నెల తిరుమల శ్రీవారి ఆలయం సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇక డిసెంబర్‌ నెలలో కూడా డిసెంబర్‌ నెలలో తిరుమల శ్రీవారి ఆలయం ప్రతి నెల సరికొత్త రికార్డులు సృష్టించింది. డిసెంబర్‌ మాసంలో తిరుమల శ్రీవారిని 19.16 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే… డిసెంబర్‌ నెలలో తిరుమల శ్రీవారి ఆలయం హుండీ ఆదాయం రూ. 116.7 కోట్లుగా నమోదు అయింది. డిసెంబర్‌ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో కోటి 46 వేల లడ్డూలు భక్తులకు విక్రయించింది టీటీడీ.

ఇది ఇలా ఉండగా, అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి తిరుపతి లడ్డూలు పంపనున్నట్లు ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని చెప్పారు. లక్ష లడ్డూలను అయోధ్యకు చేరవేయనున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు.