తెలంగాణ ఎన్నికల పోరు తారాస్ధాయికి చేరుకుంది. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు సోమవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఆదివారం టీఆర్ఎస్ అభ్యర్ధులకు కేసీఆర్ బీ-ఫారం అందించడంతో నామినేషన్ వేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్దులు రెడీ అయ్యారు. అయితే మహాకూటమిలో అభ్యర్ధుల ఎంపిక కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటికే మహాకూటమి సీట్లపై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. టీడీపీకి 14 సీట్లు కేటాయించగా టీజేఎస్‌కు 8 సీట్లు, సీపీఐకు నాలుగు సీట్లు కేటాయించగా మిగిలిన సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయనుంది. అయితే మహాకూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఖరారు అనేది ఖారారు అయినా అభ్యర్ధుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.
ఈ క్రమంలో మహాకూటమిలో భాగంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ తన అభ్యర్ధులను సోమవారం అధికారికంగా ప్రకటించనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు. ఈ నేపధ్యంలో మహాకూటమిలో టీడీపీ పోటీ చేయబోయే 11 స్థానాలపై ఓ స్పష్టత వచ్చినట్లు ఆయన తెలిపారు. మరో మూడు సీట్లపై క్లారిటీ రావాల్సి ఉన్నట్లు సమాచారం. ఇక ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ఎల్బీ నగర్ సీట్లపై సందిగ్ధత నెలకొంది. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ… పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఇస్తామని ఎల్.రమణ తెలిపారు. తెలంగాణలో టీడీపీ తిరుగులేని శక్తిగా అవతరించాలని ఆయన పిలుపునిచ్చారు.
అయితే రమణ క్లారిటీ వచ్చిందని చెబుతున్న 11 స్థానాలు ఇవేనని తెలుస్తోంది.
1.సత్తుపల్లి- సండ్ర వీరయ్య
2.అశ్వారావుపేట – మచ్చా నాగేశ్వరరావు
3.ఖమ్మం – నామా నాగేశ్వరరావు
4.ఉప్పల్ – వీరేంద్ర గౌడ్
5. శేరిలింగంపల్లి – భవ్య ఆనంద ప్రసాద్
6. కూకట్‌పల్లి – పెద్దిరెడ్డి/మందాడి
7. వరంగల్ ఈస్ట్- రేవూరి చంద్రశేఖర్
8. మక్తల్ – కొత్తకోట దయాకర్ రెడ్డి
9. మహబూబ్ నగర్ – ఎర్ర శేఖర్
10. నిజామాబాద్ రూరల్- మండవ వెంకటేశ్వరరావు
11. నకిరేకల్ – పాల్వాయి రజనీకుమారి