Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్లీపర్ సెల్స్ .. తీవ్రవాదం, డ్రగ్స్ కేసుల్లో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ అన్నాడీఎంకే రెబల్ లీడర్ దినకరన్ పుణ్యమా అని ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా స్లీపర్ సెల్స్ తయారయ్యారట. పళని సర్కారును కూల్చడానికి స్లీపర్ సెల్స్ ను రెడీ చేశామని, వాళ్లు అవసరమైనప్పుడు తమ శిబిరానికి వస్తారని దినకరన్ చెబుతున్నాడు.
అటు పళని ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను కలిపి ఉంచడానికి నానా పాట్లు పడుతోంది. ఇదే ఛాన్స్ అని ప్రతి ఎమ్మెల్యే పదవులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం అసాధ్యం. ఇప్పటికే పన్నీర్ తో వేగలేకపోతున్న పళనికి.. ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఇప్పటిదాకా అండగా ఉన్న ఢిల్లీ.. ఇప్పుడు ఇంటర్నల్ మేటర్ అని చెప్పి తప్పుకుంది.
తనకు నలభై మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని కూలుస్తామని దినకరన్ చెబుతున్నారు. కానీ గవర్నర్ మాత్రం బలపరీక్ష జరిగి ఆరు నెలలు కాలేదు కాబట్టి ఇప్పుడు అవసరం లేదని రాజ్యాంగం చెబుతున్నారు. సరే ఓ నెల లేటుగా బలపరీక్ష జరిగినా.. పళని ఏం పావుకుంటారనే విషయంపై మోడీకే క్లారిటీ లేదు. సీఎంగా ఎమ్మెల్యేల్ని కనిపెట్టలేకపోవటం చేతకానితనం కిందకే వస్తోంది.
మరిన్ని వార్తలు: