ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని ప్రేమికులను పరువు హత్యలు వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ విషయం అర్ధం కాని కొందరు మాత్రం అవి కుల హత్యలు, లేదా మత హత్యలు అంటూ పొరబడుతున్నారు. అయితే ఇది కేవలం మన దేశానికీ మాత్రమె పరిమితం కాలేదు. కులాల ప్రసక్తి ఉండదని భావించే ముస్లిం దేశాల్లోనూ ఈ నేరాలు సాగిపోతున్నాయి. తమ కుటుంబ పరువు పోతోందన్న అక్కసుతో ప్రేమజంటను అత్యంత భయానకంగా నరికి చంపారు. ఇద్దరినీ తాళ్లతో కట్టేసి తలలు తీశారు. తమ కంటే తక్కువ ఆస్తి కలిగిన యువకుడిని ప్రేమించినందుకు కన్నకూతురితో పాటు ఆమె ప్రియుడిని కూడా తండ్రి హతమార్చాడు. ఈ హత్య చేసేందుకు నిందితుడి కుటుంబ సభ్యులు కూడా సహకరించారు.
ఘటనకు సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళితే పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలోని అటోక్ జిల్లాలో ఆదివారం సాయంత్రం తన ప్రియురాలిని కలవడానికి ఆమె ఇంటికి వెళ్లిన యువకుడు ఆ ఇంటి యజమానికి దొరికిపోయాడు. తర్వాత ప్రేమికులిద్దరూ తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలిపారు. అయితే ఆ విషయం తెలియగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఇంటి పెద్ద కుటుంబ సభ్యుల్ని సమాయత్తం చేసి 18 ఏళ్ల తన కూతురిని, ఆమెను కలవడానికి వచ్చిన 21 ఏళ్ల యువకుడిని తాళ్లతో బంధించాడు. తర్వాత వారిని కొట్టి వారి గొంతులను కోశాడు. అయితే అటోక్ జిల్లాలో పరువు హత్య జరిగిందనే విషయం దావానలంలా వ్యాపించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరి నిందితులలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి పై కేసులు కూడా నమోదు చేశారు.