ఉండవల్లి తెల్లజెండాలో ఆ రంగులున్నాయి.

undavalli arun kumar comment on political entry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత జగన్ కి అండగా ఒకప్పటి వై.ఎస్ కోటరీలో ముఖ్యులంతా మిత్రుడు కొడుక్కి మేలు చేయాలని ఓ నిర్ణయం తీసుకున్నట్టు ఇటీవలే వార్తలు గుప్పుమన్నాయి. కేవీపీ ఆదేశాల మేరకి మాజీ ఎంపీ ఉండవల్లి వారిని ఒక్క తాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా బయటికి పొక్కింది. మళ్లీ జగన్ దగ్గరకు వెళ్లేందుకు ఇష్టపడని ఓ నాయకుడు ఉండవల్లి తనను సంప్రదించిన మాట బయటపెడితే ఈ మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది. ఇలా విషయం బయటికి రావడం తనకు అప్పగించిన పనికి ఏదైనా ఇబ్బంది అని భావించారో ఏమో గానీ వెంటనే ఉండవల్లి వివరణ ఇచ్చారు.

ఉండవల్లి తాజాగా తాను రాజకీయాల నుంచి రిటైర్ అయినట్టు చెప్పుకున్నారు. ఇకపై ఏ పార్టీలో చేరే ఆలోచన కూడా లేదన్నారు. అయితే వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని ఉండవల్లి చెప్పారు. తాను రాసే లేఖలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదని ఉండవల్లి ఆవేదన చెందారు. అయితే ఉండవల్లి నాలుక, మాట ఇప్పుడు మాత్రమే ఎందుకు లేస్తున్నాయి అనేదానిపై లోగుట్టు ఆయనకు ఎంత తెలుసో జనానికి అంతే తెలుసు. కాకుంటే ఆ విషయం ఆయనకి అర్ధం కావడం లేదు. అందుకే తెల్లజెండా ఎత్తినట్టు ఉండవల్లి చెబుతున్నా అందులో వైసీపీ రంగు జనానికి స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరిన్నివార్తలు 

నంద్యాలలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ

చంద్రులిద్దరికీ మోడీ స్వీట్ న్యూస్.