Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్నాళ్లుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పత్రికా ప్రకటనలు, ప్రెస్ మీట్లు చూస్తే ఒక్క విషయం బాగా అర్ధం అవుతుంది. 2019 లో ఎలాగైనా జగన్ కి అధికార పీఠం దక్కేలా చూసేందుకు పాపం ఉండవల్లి తెగ ప్రయత్నిస్తున్నారు. అందుకే జగన్ కి వ్యతిరేకంగా ఏ సర్వే వచ్చినా వెంటనే అది నిజం కాదని చెప్పేందుకు, చంద్రబాబు సర్కార్ ని ఇరకాటంలో పెట్టేందుకు గట్టిగా గొంతు వినిపిస్తున్నారు. అయితే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మాటిమాటికీ నేను ఏ పార్టీ లో లేనని చెబుతున్నారు. అలా అంటున్నా ఉండవల్లి మాటలు, చేతల ద్వారా అసలు నిజాలేమిటో జనానికి బాగానే అర్ధం అవుతున్నాయి. నిన్న అమరావతి అసెంబ్లీ చూసేందుకు మల్లాది విష్ణు తో కలిసి వచ్చిన ఉండవల్లి తాను ఏ పార్టీ మనిషిని కాదని చెప్పుకొచ్చారు. కానీ తెల్లవారగానే సదరు మల్లాది విష్ణు జగన్ ని కలిసాక వైసీపీ లో ఎప్పుడు చేరేది ప్రకటిస్తానని చెప్పారు.
ఇక ఈరోజు విజయవాడలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఉండవల్లి చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా పోలవరం పూర్తి అయినా దాని వల్ల చంద్రబాబుకి పేరు రాకుండా చూడాలని తన మాటలతో చాలా తాపత్రయపడ్డారు. ఈ కోవలోనే పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకాల అవసరం ఏంటని కూడా ప్రశ్నించారు. ప్రెస్ ముందు ఆయన లేవదీసిన అంశాలు ఇవే…
- వైఎస్ హయాంలో పోలవరం నిర్మాణాన్ని పరిగెత్తించారు
- పోలవరానికి ఉండవల్లి ఏం చేశాడని మంత్రి ఉమా అడగడం హాస్యాస్పదంగా ఉంది
- వైఎస్ పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తే చంద్రబాబు నేనే పూర్తి చేస్తున్నానని ఇది నా కళ అని చెప్పుకోవడం సిగ్గు చేటు
- వైఎస్ ప్రతిపాదించిన విధంగా పోలవరం నిర్మిస్తే అనుకున్న బడ్జెట్ కే పూర్తయ్యేది… కాని ప్రభుత్వాలు ఆలస్యం చెయ్యడం వలన బడ్జెట్ ను పెంచేశారు
- పోలవరం జాతీయ ప్రాజెక్టు పై చంద్రబాబు బిజెపి పై ఒత్తిడి తెచ్చి సాధించామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది… చంద్రబాబు ఒత్తిడి తేకపోతే మోదీ సంతకం చేయమన్నారా
- పోలవరం నిర్వాసితులు ఇళ్ళు కోల్పోతే కోర్టుకేళ్ళరా
- ప్రభుత్వం లో ఉండి గత ప్రభుత్వాలపై బురద జల్లడం అన్యాయం
- నేను ఏ పార్టీలో నేను … పోలవరం పై నేను మాట్లాడింది తప్పైతే చెప్పండి
- మీ అధికారులు గాని టిడిపి నేతలు కాని నా ఫోన్ లకు స్పందించడం లేదు… అందుకే ప్రెస్ మీట్లు పెట్టి అడుగుతున్నా
- పోలవరం పూర్తైతే 80 శాతం ఇరిగేషన్ కింద వచ్చేస్తుంది
- పోలవరం కి ఫ్లడ్ వచ్చినప్పుడు నీటిని విజయవాడ కు వైజాగ్ కు తరలించేందుకు వైఎస్ హయాంలోనే ప్రణాళికలు సిద్దం చేశారు
- పోలవరం కడితే వైఎస్ కు పేరు వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారు… త్వరితగతిన పూర్తి చేస్తే చంద్రబాబు పేరే ప్రజలు చెప్పుకుంటారు.
- పోలవరం నిర్వాసితులకు న్యాయం జరగడం లేదు
- పట్టిసీమ హడావుడిగా ఎందుకు పూర్తి చేశారో తెలియదు
- పోలవరం నిర్మాణానికి డబ్బులు ఎలాతెచ్చారో తెలియదు…కాని పోలవరాన్ని మాత్రం పూర్తి చేయండి
- పోలవరానికి 40వేల కోట్లు ఎలా పెంచారో అర్ధం కావడం లేదు… కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పార్టీ ఫండ్ కోసం కూడా బడ్జెట్ ను పెంచేసి ఉంటారన్న అనుమానం వస్తోంది
- గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ అంటున్నారేమో
- ప్రతిపక్షాలు విమర్శించకుండా ప్రభుత్వానికి డప్పు కొడతారా…ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి
- ఓటు కు నొటు కేసుకు చంద్రబాబు భయపడే షెడ్యూల్డ్ లోని 9, 10 కింద మనకు రావాల్సిన వాటిని చంద్రబాబు అడగడం లెదు
- ఓటుకు నోటు కేసులో చంద్రబాబు బయటపడితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది… కెంద్రాన్ని మనకు రావాల్సిన వాటిని చంద్రబాబు అడగకపోవడానికి ప్రధాన కారణం ఇదేనేమో
- 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డబుల్ డిజిట్ ఓట్లు రావడం ఖాయం
కానీ చివరగా ఉండవల్లి అనుకోకుండా బయటపెట్టిన ఓ విషయం తో జగన్ అండ్ కో బాణం తగిలినంతగా విలవిల్లాడిపోయారు. జగన్, వైసీపీ ని అంతగా బాధించిన అంశం ఏమిటంటే… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కి డబల్ డిజిట్ శాతం ఓట్లు వస్తాయని చెప్పడం. అసలే జనసేన రాకతో విపక్ష ఓటు చీలుతుందని వైసీపీ కంగారు పడుతుంటే ఇక కాంగ్రెస్ కి కూడా 10 శాతం ఓట్లు వస్తే ఇంకేమన్నా ఉందా ?. ఉండవల్లి అనుకోకుండా చెప్పినా మనసులో మాట బయట పెట్టేసారు. బీజేపీ తో చెలిమికి తహతహలాడుతున్న జగన్ కి దూరం అవుతున్న మైనారిటీ, ఎస్సీ వర్గాలు తిరిగి కాంగ్రెస్ వైపు చూడడం తో ఈ మార్పు వస్తుందని ఊహిస్తున్నదే. ఇదే విషయాన్ని బయటపెట్టిన ఉండవల్లి, జగన్ మీదకి బాణం వేసినట్టు కాదంటారా?
మరిన్ని వార్తలు