Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రతిపక్షాలపై విమర్శలకు దిగకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ విషయంలో మాత్రం ప్రత్యర్థులకు పోటాపోటీగా బదులిస్తున్నారు. గోరఖ్ పూర్ విషాదానికి బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే…యోగీ మాత్రం అసలు ఈ దారుణానికి కారణం గత ప్రభుత్వాలైన సమాజ్ వాదీ, బహుజన సమాజ్ వాదీ పార్టీలే అని ఎదురుదాడికి దిగుతున్నారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయనే దాని గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. 12-15 సంవత్సరాలగా గత యూపీ ప్రభుత్వాలు అవినీతిమయంలో కూరుకుపోయి ప్రజలకు అందించాల్సిన సౌకర్యాలను మర్చిపోయాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గోరఖ్ పూర్ పర్యటన నేపథ్యంలో ఆయనపైనా యోగీ విరుచుకుపడ్డారు. స్వచ్ఛ్ భారత్ లో భాగంగా యూపీలో స్వచ్ఛ్ ఉత్తరప్రదేశ్ – స్వస్థ్ ఉత్తరప్రదేశ్ పేరుతో ప్రారంభించిన ప్రచార కార్యక్రమంలో యోగీ మాట్లాడుతూ రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శలు చేశారు. స్వచ్ఛ్ భారత్ ప్రాముఖ్యత ఢిల్లీలో కూర్చునే యువరాజుకు తెలియదన్న యోగీ గోరఖ్ పూర్ ను తన పిక్నిక్ స్పాట్ గా మార్చుకునేందుకు ఎంతమాత్రం అనుమతి ఇవ్వబోం అని పరోక్షంగా రాహుల్ ను హెచ్చరించారు. గత వారం గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ దాస్ బీఆర్డీ వైద్యకళాశాల ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 70 మంది చిన్నారులు చనిపోయిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
మరిన్ని వార్తలు:
తూ.గోలో బయటపడ్డ కొత్త ఊరు
నంద్యాలలో ఆ డౌట్ క్లియర్ చేస్తున్న ఈసీ.