మోడీ తో కేసీఆర్ లింకు ఇదేనన్న ఉత్తమ్…!

Were Doubting That Tampering Could Have Been Done In Evms

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస పార్టీ పైన విమర్శలు గుప్పిస్తున్న ప్రజకూటమి నేతలు చేసిన ప్రధాన ఆరోపణ నరేంద్ర మోడీ మరియు కేసీఆర్ కూడబలుక్కున్నారని, వారిరువురూ ఒకటేనని. ఇదే విషయాన్నీ రాహుల్ గాంధీ కూడా తాను పాల్గొన్న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ప్రస్తావిస్తూ, కేసీఆర్ ని విమర్శించారు. ఈ విషయం మీద కేసీఆర్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో ప్రజలు కాస్త ఆసక్తిగానే ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆరోపణ చేయగానే సరిపోతుందా, తగిన రుజువులు కూడా చూపాలి కదా అని తెరాస నేతలు అనుకున్నా,నిజం నిప్పు తేలేది ఎప్పుడా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ విషయం మీద మరోసారి కేసీఆర్ ని ఇరకాటంలో పడేసేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ముందు తన ఆరోపణలకు సంబంధించిన వివరాలను బయటపెట్టారు. ఈ ఆరోపణల్లో ప్రధానాంశంగా 2006 సవంత్సరంలో కేసీఆర్ కేంద్ర కార్మికమంత్రిగా ఉన్న సమయంలో ఒక వైద్యకళాశాలను ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ నిర్మించతలపెట్టింది. ఈ భవన నిర్మాణ పనులను నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ కి అప్పగించాలని ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ భావించగా, కేసీఆర్ మాత్రం వెలుగుబంటి సూర్యనారాయణ అనే గుత్తేదారు ద్వారా ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖకు కట్టబెట్టారు.

kcr-modi

అప్పటికే వెలుగుబంటి కొన్ని అవినీతి కేసుల్లో ఇరుక్కొని ఉండడం గమనించాల్సిన విషయమయినప్పటికీ, కేసీఆర్ వీటిని ఖాతరు చేయకుండా ఈఎస్‌ఐసీ అధికారులను తన ఢిల్లీ అధికారిక నివాసానికి పిలిపించుకొని మరి నిర్మాణ పనుల కాంట్రాక్టుని అప్పగించారు. మత్స్యశాఖకు కాంట్రాక్టు అప్పగించడం కేంద్ర కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ నిబంధనలకు విరుద్ధం కావడంతో, విచారణ చేపట్టిన సిబిఐ పై విషయాలను తన అభియోగపత్రంలో పేర్కొంటూ, కేసీఆర్ పైన కేసుని నమోదు చేసింది.ఇలా సిబిఐ చార్జీ షీటులో తన పేరుండడం ఎప్పటికైనా తలనొప్పి వ్యవహారమే కనుక దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే, నరేంద్ర మోడీ తో కుమ్మక్కై ఛార్జీషీటులోని తన పేరుని తొలగించుకున్నారని, ఇందుకోసమే హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి వైద్యం అందించే కంటి ఆసుపత్రులున్న, తన కంటి ఆపరేషన్ కోసం అదేపనిగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండడం అసలు కారణంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

UTTAM-KUMARREDDY-KCR

ఈ మాటలన్నీ తాను ఊరికే చెప్పడం లేదని, తగినన్ని ఆధారాలు సేకరించాకే చెప్తున్నానని, సమయం వచ్చినప్పుడు ఆధారాలను బయటపెడతానని అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిలో పనిగా వెలుగుబంటితో నీ సంబంధం నిజం కాదంటావా కేసీఆర్ అంటూ కేసీఆర్ పైన విమర్శలు గుప్పించారు. అయినా, తగిన ఆధారాలు ఉన్నప్పుడు వెంటనే బయటపెడితే, తమ పార్టీకే ప్రయోజనం అని తెలుసు కదా ఉత్తమ్ కుమార్ కి, అయినా అవసరం అనిపిస్తేనో, సమయం వస్తేనో అని వాయిదా పద్ధతులు ఎందుకయ్యా ఉత్తమ్ కుమార? అని ఉత్తమ్ చెబుతున్న మాటలు విన్న ప్రజలు తమలో తాము ప్రశ్నించుకుంటూనే, దీనిపైనా కేసీఆర్ ఎలా స్పందిస్తాడో కూడా వేచిచూద్దాం అని ఎదురుచూస్తున్నారు.