హైదరాబాద్ లో ఉయ్యాలవాడ మునిముని మనుమరాలి పెళ్లి…!

Uyyalawada Narasimha Reddy Grand Daughters Marriage

1857లో మొదలయిన సిపాయిల తిరుగుబాటు కంటే ముందు బ్రిటిష్ పాలకులను గజగజ లాడించిన తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి పేరుతో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకేకుతున్న సంగతి తెలిసిందే. ఈరోజే అట్టహాసంగా చిత్ర టీజర్ కూడా విడుదల చేశారు. అయితే ఉయ్యాలవాడ ముని మనుమరాలు సంజన రెడ్డి వివాహం చెన్నై నగరానికి చెందిన ప్రతాప్ రెడ్డితో హైదరాబాద్ .జె.ఆర్.సి కన్వెన్షన్ నందు ఘనంగా జరిగింది. ఈ వివాహానికి తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు, దక్షిణ భారత ఉయ్యాలవాడ సేన కన్వీనర్ సినీ నిర్మాత దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సినీ నటుడు సుమన్ హాజరయ్యారు అంగరంగ వైభవంగా జరిగిన వివాహా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ, పార్లమెంట్ సభ్యుడు. జె.సి.దివాకరరెడ్డి, శాసనసభ్యులు గోనుగుంట్ల సూర్యనారాయణ, బి.సి.జనార్ధనరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ రఘువీరారెడ్డి ల తో పాటు వైసీపీకి చెందిన విశ్వేశ్వరరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

syeraa

ఈ సందర్భంగా ఉయ్యాలవాడ ముని మనవడు పెళ్లికుమార్తె తండ్రి మంతల్డుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను గతంలో తామీ సినిమాగా తెరకెక్కిద్దామనుకున్నామని అప్పట్లో ఈ విషయమై సుమన్ ను సాయికుమార్ ను కూడా సంప్రదించడం జరిగిందని కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కార్య రూపం దాల్చలేదని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు చిరంజీవి తనయుడు రాంచరణ్ నిరమాతగా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంహీవి హీరోగా ఉయ్యాలవాడ జీవితంను సినిమాగా తియ్యటం చాలా సంతోషంగా ఉందని ముఖ్యంగా వాడ…వాడలా తిరిగి తొలి స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని జాతీయవీరుడుగా గుర్తించాలని అన్ని రాష్ట్రాలలో తిరిగి సంతకాల సేకరణ కార్యక్రమంను చేపట్టిన దక్షిణ భారత ఉయ్యాలవాడ సేన ,కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

ramcharan