వైసీపీ నుంచి బయటకువచ్చిన వంగవీటి రాధా తన భవిష్యత్ కార్యాచరణపై మల్లగుల్లాలు పడుతున్నారు. తమ పార్టీలోకి రావాలని టీడీపీ ఆహ్వానం పలికినా సైకిల్ ఎక్కేందుకు రాధా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పుడే ఒకానొక దశలో ఆయన టీడీపీలోకి వెళ్తే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగింది. రాధా మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో వున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నమాట. ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే దానిపై ఆయన తర్జనభర్జన పడుతున్నారు. ఈ క్రమంలో రాధా ఇంటికి వెళ్లి ఆయనను లగడపాటి రాజగోపాల్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో లగడపాటి భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఏపీ ప్రజల డేటా దొంగతనం వ్యవహారంపై వారు చర్చించినట్టు చెబుతున్నారు.
కోడెలతో భేటీ తర్వాత లగడపాటి రాజగోపాల్ వంగవీటి రాధాను కలిశారు. కోడెలను కలిసిన వెంటనే ఆయన రాధాను కలిసిన నేపథ్యంలో రాధాతో లగడపాటి భేటీ ఆసక్తికరంగా ఉంది. ఇది రాజకీయ భేటీనే అని చెబుతున్నారు. అనకాపల్లి,ఉదయగోదావరి జిల్లా ల్లో ఎక్కడో ఒక చోట టీడీపీ ఎంపీ అభ్యర్థి గా రాధ పోటీ టీడీపీ రాజగోపాల్ తో ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ లెక్కన రాధా వెస్ట్ లేదా ఈస్ట్ లో ఏదో ఒక ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగడం ఖాయమని అంటున్నారు.