Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అత్త మీద కోపం దుత్త మీద చూపించడమంటే ఎలా ఉంటుందో వంగవీటి రాధాని చూస్తే అర్ధం అవుతుంది. రంగ మీద ఓ వైసీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు నానా రచ్చ అయితే ఆ విషయాన్ని వదిలిపెట్టి లోటస్ పాండ్ సూచనల మేరకు సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ప్రెస్ ముందుకు వచ్చారు. సీఎం కి కామన్ సెన్స్ లేదని అన్నారు. దీంతో పాటు రాధా చేసిన కామెంట్స్ ఏమిటో కాస్త చూడండి.
- చంద్రబాబు సిఎం స్థాయికి తగ్గట్టు హుందాగా వుండాలి.
- మా పార్టీలో ఎవరు తప్పు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటారు.
- మీ పార్డీలో సిఎంనే జెసి దివాకర్ రెడ్డి విమర్శించినా పట్టించుకోని పరిస్థితి.
- విజయవాడలో రంగాపై వ్యాఖ్యల నేపథ్యంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా చంద్రబాబు మాట్లాడారు.
- చంద్రబాబు కు కనీస కామన్ సెన్స్ లేదు.
- ఓ మాజీ శాసనసభ్యురాలిని రోడ్డుపై పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్ళారు.
- దీనికి సంబంధించిన అధికారుల తీరుపై సిఎం కనీసం స్పందించకపోవడం దారుణం.
- లా అండ్ ఆర్డర్ పై సిఎంకు పట్టులేదు.
- చిత్తశుద్ధి వుండే ఈ ఘటనలో పోలీసుల వ్యవహార శైలిపై విచారణ జరపాలి.
- దీనిపై న్యాయపోరాటం చేస్తాం.
- అనుచితంగా వ్యవహరించిన పోలీసుల పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయబోతున్నాం.
- రంగా అభిమానులు సంయమనం పాటించాలని కోరేందుకే ప్రెస్ మీట్ పెట్టాలని భావించాం.
- పోలీసులు ఎవరి ఆదేశాలతో మమ్మల్ని అడ్డుకున్నారో తెలియదు.
- వైఎస్ఆర్ సిపి లో పూర్తి క్రమశిక్షణ వుంది.
- వంగవీటి రంగాపై మాట్లాడిన వారిని వెంటనే సస్పెండ్ చేశారు.
- తెలుగుదేశం పార్టీలో అధిష్టానం ను విమర్శించినా ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి మీది.
- అటువంటి చంద్రబాబు మమ్మల్ని విమర్శించడం హాస్యాస్పదం
: వంగవీటి రాధాకృష్ణ
మరిన్ని వార్తలు: