Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంచలన పోర్న్ చిత్రం ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’. ఈ చిత్రంపై పలువురు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుతో పోలీసులు సినిమాను వీడియో బ్రౌజింగ్ పోర్టల్ విమియో నుండి తొలగించినట్లుగా వార్తలు వచ్చాయి. నేడు ప్రముఖ దిన పత్రికల్లో కూడా ఈ వార్తను ప్రచురించడం జరిగింది. మీడియాలో వచ్చిన వార్తలపై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. పోలీసు వారు ఫిర్యాదుల కారణంగా ఆ వీడియోను తొలగించలేదని, ఇండియాలో ఇక ఆ వీడియో కనిపించదంటూ వచ్చిన వార్తలు నిజం కాదని వర్మ చెప్పుకొచ్చాడు.
‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ చిత్రాన్ని స్ట్రయిక్ ఫోర్స్ సంస్థ నిర్మాతలు ‘గాడ్‌సెక్స్‌ట్రూత్‌మూవీ.ఆన్‌లైన్’ పోర్టర్‌లో అధికారికంగా పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోను విమియో పైరసీని పోస్ట్ చేయడం జరిగింది. కాపీ రైట్ యాక్ట్ కింద ఆ వీడియోను తొలగించినట్లుగా వర్మ పేర్కొన్నాడు. పోలీసుల వల్ల ఆ వీడియోను తొలగించలేదని, కాపీ రైట్ యాక్ట్‌ను నిర్మాతలు విమియో ముందు పెట్టగా వారు తొలగించినట్లుగా వర్మ చెప్పుకొచ్చాడు. ఇండియాలో అధికారిక వెబ్ సైట్‌కు వెళ్లి 150 రూపాయలు చెల్లించి తాను తెరకెక్కించిన జీఎస్టీ చిత్రాన్ని చూడవచ్చు అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. జీఎస్టీకి వచ్చిన ఆధరణతో సంతోషంగా ఉన్న వర్మ త్వరలోనే సీక్వెల్ చేస్తాను అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. పోర్న్ స్టార్ మియా మాల్కోవతో సీక్వెల్ ఉంటుందా లేదా మరో కొత్త పోర్న్ స్టార్‌ను వర్మ తీసుకు వస్తాడా అనేది చూడాలి.